చాలాకాలం తర్వాత తనదైన శైలికి భిన్నంగా జగన్ కోలుకోలేని రాజకీయం అస్త్రం చంద్రబాబు ప్రకటించారు.
ఇలాంటి సంచలన నిర్ణయాలు చంద్రబాబు నుంచి చాలా తక్కువగా వినిపిస్తుంటాయి.
టీడీపీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రకటన చేసినా… ఏదో ఒక అబద్ధంతో దానిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీకి చంద్రబాబు ఇటీవల కాలంలో ఇచ్చిన అతిపెద్ద షాక్ ఇదే.
మా ఎమ్మెల్యేల పనితీరుపై నాకు నమ్మకం ఉంది. పార్టీలో కొనసాగుతున్న ప్రతి సిట్టింగ్ ఎమ్మెల్యేకి నేను టిక్కెట్ ఇస్తాను
జగన్ తన పాలనపై, తన ఎమ్మెల్యేల పనితీరుపై నమ్మకం ఉంటే జగన్ కి దమ్ముంటే అందరు సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇవ్వగలరా? అని అసెంబ్లీలో నిలదీయమని సభ్యులకు సూచించారు.
తాజాగా అమరావతిలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు ఈ సంచలన ప్రకటన చేశారు.
ఒక రకంగా జగన్ ను గట్టిగా గిల్లాడని చెప్పాలి. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఇపుడున్న వారికే టిక్కెట్లు ఇస్తే వారిలో 100 మంది ఓడిపోయే అవకాశం ఉంది. అందుకే జగన్ భయపడుతున్నాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయం వైసీపీ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లే అనుకోవాలి.