ఏపీలో అధికార దుర్వినియోగం, అరాచక రాజకీయ ఆగడం లేదు. పైగా పరిస్థితులు అంతకంతకూ విషమిస్తున్నాయి. ప్రతిపక్షాన్ని తొక్కేయడానికి అధికారపక్షం విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు భౌతిక దాడులకు కూడా దిగుతున్నారు.
తాజాగా టీడీపీ నేత మీద జరిగిన దాడితో బెజవాడ ఉలిక్కిపడింది. సమకాలీన రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరుతో పాటు వివాదరహితుడిగా పేరున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై కొందరు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారు వైసీపీకి చెందినవారుగా గుర్తించినట్లు తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.
పటమటలంకలోని గర్ల్స హైస్కూల్ వద్ద గాంధీపై వైసీపీకి చెందిన వర్గీయులు దాడి చేసిన దుర్ఘటనలో ఆయన కంటికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆయన్ను తాడిగడప ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తరలించారు.
తాజా దాడి వెనుక దేవినేని అవినాష్ మనుషులున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో చెన్నుపాటి గాంధీ భార్య తొమ్మిదో డివిజన్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఓడిన వైసీపీ అభ్యర్థి మనుషులు వల్లూరు ఈశ్వర్ ప్రసాద్.. గద్దె కల్యాణ్.. సుబ్బుతో పాటు మరో ముగ్గురు దాడి చేసినట్లుగా టీడీపీ ఆరోపిస్తోంది.
స్థానికులు అందిస్తున్న సమాచారం ప్రకారం.. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కార్పొరేషన్ సిబ్బందితో పైపులైను లీకేజీ పనులు చేయిస్తున్నారు గాంధీ. అక్కడికి వచ్చిన వైసీపీ వాళ్లు మా ప్రభుత్వంలో తెలుగుదేశం పెత్తనం ఏంది? అంటూ వాగ్వాదానికి దిగారు. ‘నిన్నుచంపుతాం. మాకు ఎదురులేదు. మీకు దిక్కెవురు? మా ప్రభుత్వం మంజూరుచేసిన పనులు నువ్వు చేయటం ఏమిటి?’ అంటూ కర్రలు..రాళ్లతో కొడుతూ.. పిడిగుద్దులు గుద్దారు. ఇనుప చువ్వతో దాడి చేయటంతో గాంధీ కుడి కన్నుపూర్తిగా దెబ్బ తింది. స్థానికులు కొందరు అడ్డుకోవటంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం గాంధీని ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడిపై స్పందించిన లోకేశ్.. ‘ఇంకెన్నాళ్లీ నెత్తుటి రాజకీయాలు చేస్తారు జగన్ రెడ్డిగారు. దాడికి తెగబడింది మీ వైసీపీ ఫ్యాక్షన్ మూకలే. అధికారం శాశ్వతమనుకొని పోలీసులు సాయంతో రక్త చరిత్ర రాసున్నావు. తిరుగుబాటు మొదలైంది. అధికారం అండతో రెచ్చిపోతున్న వైసీపీ రౌడీమూకలకి మరోసారి హెచ్చరిస్తున్నాను. ప్రతీ పేరు రాసుకున్నాం. కొడితే కొట్టించుకుంటున్నాం అనుకుంటున్నారు మీరు. మేము తిరిగి కొట్టే రోజున జగన్ రెడ్డి రారు. పోలీసులు కనపడరు. దెబ్బకి దెబ్బ ఎలా వుంటుందో చూపిస్తాం.‘‘ అని హెచ్చరించారు.
కార్పొరేటర్ అయినా సామాన్య జీవితమే గడుపుతున్న టిడిపి సీనియర్ నేత చెన్నుపాటి గాంధీ..#AndhraPradesh #vijayawada #Corporater #chennupatigandhi pic.twitter.com/3bBu57p1I6
— Kaza Vk Ramabrahmam (@KazaVk) September 4, 2022