ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రం లోని ఏ కాలేజీ అయినా ఇక నుంచి జెఎన్ టియు పేపర్లతోనే ఎగ్జామ్స్ పెట్టాలని నిర్ణయించింది. అటానమస్ కాలేజీలు ఇకపై సొంత పరీక్షలు నిర్వహించలేవు. వాటి విద్యార్థులకు కూడా పరీక్ష పేపర్లు జెఎన్టీయు విశ్వవిద్యాలయం సెట్ చేయనుంది.
అటానమస్ పేరుతో సొంతంగా ప్రశ్నా పత్రాలు తయారు చేసి అక్రమాలకు పాల్పడే కాలేజీలకు చెక్ పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అందుకే ఇకపై అటానమస్ కాలేజీలు సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకునే విధానాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.
అటానమస్తో పాటు నాన్-అటానమస్ కాలేజీలకు కూడా జేఎన్టీయూ యూనివర్సిటీయే ప్రశ్నాపత్రాలు రూపొందిస్తుంది. ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్ కూడా జేఎన్టీయూ చేస్తుంది.
మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇకపై ప్రతీ కోర్సులోనూ అప్రెంటీస్ విధానం తీసుకురావాలని షరతు పెట్టింది.