ఇది కదా… సంచలనం అంటే !
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కలలు ఒక్కొక్కటీ చిద్రమవుతున్నాయి.
నిబంధనలు ఉల్లంఘించి, సంప్రదాయాలు ఉల్లంఘించి తప్పుడు విధానాల్లో అనామకులను, అర్హత లేని వారికి పదవులు కట్టబెట్టిన తీరుపై ఏపీ హైకోర్టు మండిపడింది.
అధికారం ఉన్నంత మాత్రాన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే కుదరదు అని తేల్చిచెప్పింది. విజయనగరం గజపతి వంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్టు, సింహాచలం ఆలయ ట్రస్టుల చైర్మన్‌గా ఉన్న టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును రాత్రికిరాత్రి మార్చడం తప్పు అని పేర్కొంది. దానికి గాను ఏపీ సర్కారు ఇచ్చిన జీవో 72 ను హైకోర్టు కొట్టి పారేసింది.
ఈ క్రమంలో అప్పట్లో అసబద్ధంగా అశోక్ గజపతి రాజును తొలగించడంపై, అశోక్ గజపతిరాజు సోదరుడు దివంగత ఆనందగజపతి రాజుతో విడాకులు తీసుకున్న భార్య కుమార్తె సంచయిత ను నియమించడంతోపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
ఉత్తరాంధ్ర వైసీపీలోనే ఇది తప్పు అన్న అభిప్రాయం వెల్లడైంది. ఈ అర్ధరాత్రి నల్లజీవోను తొలగించాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది.
ఇవేమీ లెక్కచేయకుండా జగన్ సర్కారు ఇచ్చిన జీవోను అడ్డు పెట్టుకుని రాత్రికిరాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన సంచయిత సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో అశోక గజపతి రాజు హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు తాజాగా తుది తీర్పు వెలువరిస్తూ సంచయిత గజపతిరాజు నియామకం చెల్లదని తేల్చిచెప్పింది. అశోక్ గజపతిరాజును ట్రస్టుల ఛైర్మన్‌గా పునర్నియమించాలని జగన్ సర్కారును ఆదేశించింది.
వీటితో పాటు.. మహాలక్ష్మి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్‌గా కూడా అశోక్‌ను నియమించాలని ఆదేశించింది.
మాన్సాస్ ట్రస్ట్‌ని చెరబట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో ధర్మం, చట్టం, న్యాయందే అంతిమ విజయం అని తేలింది. ఈ తీర్పు అప్రజాస్వామికంగా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అర్ధరాత్రి చీకటి జీవోలు జారీచేస్తోన్న @ysjagan సర్కారుకి చెంపపెట్టు.(1/3) pic.twitter.com/oR3jz661Ad
— Lokesh Nara (@naralokesh) June 14, 2021