మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించినది ఆరోపిస్తున్న ఒక ఆడియో టేప్ లీక్ కావడం ఏపీ రాజకీయాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అంబటిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అరగంట అంటూ అంబటిపై సెటైర్లు వేశారు. ఆ తర్వాత ఈ ఏడాది సంక్రాంతి సంబరాల సందర్భంగా సత్తెనపల్లిలో సుగాలీ మహిళలతో కలిసి అంబటి తీన్మార్ వేశారు. ఈ నేపథ్యంలోనే
తాజాగా పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమాలో అంబటిపై పవన్ పరోక్షంగా సెటైర్లు వేశారు.
అంబటి పాత్రను పోలినట్లుగా పృథ్వీ రాజ్ శ్యాంబాబు పాత్రను రూపొందించారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఆ రోజు సంక్రాంతి సందర్భంగా అంబటి వేసుకున్న డ్రెస్ ను పృథ్వీ ధరించి ఓ పాటలో స్టెప్పులు వేశారు. ఆ తర్వాత ఏంటి అని పవన్ అడగ్గానే..సెక్స్ అంటూ పృథ్వీ జవాబిస్తారు.
నీకెప్పుడూ అదే యావ అంటూ పవన్ పంచ్ వేస్తారు. ఈ లలిత కళలను వదిలేయి శ్యాంబాబు అంటూ పవన్ పంచ్ వేస్తాడు. ఈ క్రమంలోనే పవన్ పై అంబటి తాజాగా ట్వీట్ చేశారు. ‘గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి # పవన్ కల్యాణ్’ అంటూ పవన్ పై అంబటి చేసిన ట్వీట్ వైరల్ అయింది.