Farmers and women of #Amaravati region, took out a rally as part of ‘Nyayasthanam to Devasthanam’ Padayatra in #Tirupati city. @xpressandhra@Kalyan_TNIE@NewIndianXpress#AmaravatiFarmersMarch
Video by @KanchiMadhav pic.twitter.com/VSlWnkcb1d— D Surendra Kumar (@Surendra_TNIE) December 14, 2021
మహా అద్భుతం… నేల తల్లి బిడ్డల సభ గ్రాండ్ సక్సెస్.
బలవంతంగా తెచ్చిన కాలేజీ పిల్లలూ, స్కూల్ పిల్లలు లేరు..
మందు బాటిళ్లు లేవు… బిర్యానీ ప్యాకెట్లు లేవు..
జనాన్ని తరలించిన స్కూల్, కాలేజీ బస్సులు లేవు.
ఇవేమీ లేకపోగా… ఎక్కడికక్కడ ప్రభుత్వ నిర్బంధాలు
అయినా వాటన్నింటిని అధిగమించి వచ్చిన జన వాహిని తో కిక్కిరిసి పోయిన సభా ప్రాంగణము.
ఎవరూ తరలించకుండా వచ్చిన లక్షలాది జనం, అది కూడా శ్రీవారి పాదాల చెంతన గుడిగూడటం అంటే అది శ్రీవారి చల్లని ఆశీర్వాదమే.
అమరావతి రైతుల సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సభ ఘనంగా జరిగింది.
అమరావతి సభలో అదరగొట్టిన రఘు రామ కృష్ణం రాజు ..#AmaravatiFarmers #AmaravatiFarmersMarch pic.twitter.com/EuZ7MLDBTt
— ???? ???????????????????????? ???? (@dmuppavarapu) December 17, 2021
‘ఒక్క వైకాపా తప్ప రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయి జగన్ , నువ్వు ఏమీ చేయకుండా నీ ప్యాలెస్ లో పడుకున్నా కూడా అమరావతి అభివృద్ధి అవుతుంది’ అది అమరావతి మోడల్ అని చంద్రబాబు ఈ సభలో వ్యాఖ్యానించారు.
మాట తప్పను మడమ తిప్పను అని చెప్పే నువ్వు అమరావతిపై మడమ తిప్పావా లేదా చెప్పు జగన్ రెడ్డీ అని చంద్రబాబు నిలదీయడంతో సభలో హర్షద్వానాలు మారుమోగాయి.
అమరావతి మునిగిపోతుంది అని తప్పుడు ప్రచారాలు చేశారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన 3ఏళ్లలో ఎన్ని సార్లు మునిగింది అమరావతి అని చంద్రబాబు ప్రశ్నించారు.
తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహిస్తున్న “అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ” కు రాకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ప్రజలను పోలీసుల ద్వారా అడ్డుకోవడం.. టీడీపీ నాయకులతో సహా ఇతర పార్టీ నాయకులను గృహ నిర్భంధం చేయడం వంటివి ఎన్ని చేసినా ఈ సభ ఘనంగా జరిగిందంటే అమరావతిపై , ఒకే రాజధానిపై ప్రజల ఆకాంక్ష ఎంత గట్టిగా ఉందో అర్థమవుతోంది.