తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప మనసు మరోసారి బయటపడింది. కష్టమని చెప్పుకున్న ఓ కుటుంబానికి రెండు నిమిషాల్లోనే చంద్ర బాబు రూ. 2 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో సీఎం చంద్రబాబు 30వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారమే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ పంపిణీ జరిగింది.
అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు నేమకల్లు గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ అందించారు. ఈ క్రమంలోనే ఓ ఇంటికి వెళ్లగా.. అక్కడ పేదింటి యువతి తన కష్టాన్ని ముఖ్యమంత్రికి చెప్పుకుంది. `తమను మా తమ్ముడు బాగా చూసుకుంటాడని.. కానీ ఈ మధ్య అతని కూతురుకు గుండె సమస్య వచ్చిందని తెలిపింది.
తమకు వచ్చే పింఛను డబ్బులు కూడా ఆ పాప చికిత్సమే ఖర్చు చేశామని.. బెంగుళూరులో పాపకు గుండె ఆపరేషన్ జరిగినట్టు తెలిపింది. తమ్ముడు అప్పుల పాలయ్యాడు సాయం చేయమని సదరు యువతి కోరడంతో.. చలించిపోయిన చంద్రబాబు అప్పటికప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.2 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సమస్యంటే అధికారులకు చెప్పండి చూస్కుంటామని చెప్పి తప్పించుకునే నాయకులు ఉన్న ఈ రోజుల్లో చంద్రబాబు కష్టమనగానే స్పాట్ లో సాయం చేసి ప్రజలందరి మనసు దోచుకున్నారు. బాబు గారు నిజంగా బంగారమే అని అందరితో అనిపించుకున్నారు.
కష్టం చెప్పుకుంటే అప్పటికప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.2 లక్షల సాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు చంద్రబాబు గారు. “నన్ను మా తమ్ముడు బాగా చూసుకుంటాడు. అతని కూతురుకు గుండె సమస్య ఉంటే మాకు వచ్చే పింఛను డబ్బులు ఖర్చు చేశాం. తమ్ముడు అప్పుల పాలయ్యాడు సాయం చేయమని” అడిగిన… pic.twitter.com/1udlcKk1VM
— Telugu Desam Party (@JaiTDP) November 30, 2024