• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆర్జీవీ పిట్ట‌క‌థ‌.. సుబ్బారావు ఇడ్లీల‌తో `పుష్ప 2` కు లింకేంటి..?

admin by admin
December 4, 2024
in Movies, Trending
0
0
SHARES
105
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దేశ‌వ్యాప్తంగా `పుష్ప 2` హ‌డావుడి ప్రారంభ‌మైంది. రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 12,000 స్క్రీన్‌లలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి నేటి రాత్రికే బెనిఫిట్ షోలు ప‌డబోతున్నాయి. భారీ క్రేజ్ కార‌ణంగా పుష్ప 2 టికెట్ ధ‌రలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దేశంలో ప్ర‌ధాన న‌గ‌రాల్లో రూ.1500 వరకూ టికెట్ ధర పలుకుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో టికెట్ ప్రైజ్‌ రూ.1,000 వరకూ ఉంది. ఈ విష‌యంపై సినీ ల‌వ‌ర్స్ తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. పుష్ప 2 టికెట్ ధ‌రలు సామాన్యుల‌కు అందుబాటులో లేవంటూ మండిప‌డుతున్నారు.

ఈ విష‌యంపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా స్పందించారు. టికెట్ రేట్లు ఎక్కువ‌ని విమ‌ర్శిస్తున్న వారికి ఎక్స్ వేదిక‌గా త‌నదైన శైలిలో ఓ పిట్ట‌క‌థ చెప్పి గట్ట‌గా కౌంట‌ర్ ఇచ్చారు. `సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.

కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు. సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు అని ఎవరైనా ఏడిస్తే , అది సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు అని ఏడ్చినంత వెర్రితనం.

ఒకవేళ సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాఏ. డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు. లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు ?

ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా? ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు , ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానెయ్యొచ్చూ, లేదా తర్వాత రేట్లు తగ్గక చూసుకోవచ్చు కదా? మల్లి సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది .. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి` ఆర్జీవీ చెప్పుకొచ్చారు. మొత్తానికి సుబ్బారావు ఇడ్లీతో పుష్ప 2 మూవీకి లింక్ పెట్టి ఇచ్చిప‌డేశారు.

Tags: allu arjundirector sukumarLatest newspan india moviepushpa 2Pushpa 2 MoviePushpa 2 Ticket Ratesram gopal varmaRGVTelugu movies
Previous Post

మహారాష్ట్ర సస్పెన్స్ వీడింది..సీఎం ఆయనే

Next Post

లోకేశ్ కు ఆ డ్రైవర్ కృతజ్ఞతలు

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
modi
India

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

May 12, 2025
Movies

ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?

May 12, 2025
India

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

May 12, 2025
Load More
Next Post

లోకేశ్ కు ఆ డ్రైవర్ కృతజ్ఞతలు

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra