వైసీపీ హయాంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని.. లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు బలమైన ఆరోపణ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే శ్రీవారి లడ్డూ కల్తీ ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు స్వతంత్ర బృందంతో విచారణ జరిపించాలని న్యాయస్థానం తిర్పునిచ్చింది.
ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని.. వారిలో కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు ఉండాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఇక సుప్రీం తీర్పుపై సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. `తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తునకు సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నాను. సత్యమేవ జయతే, ఓం నమో వేంకటేశాయ` అంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్ట్ పెట్టారు.
I welcome the Honourable Supreme Court’s order of setting up SIT, comprising officers from CBI, AP Police and FSSAI to investigate the issue of adulteration of Tirupati laddu.
Satyamev Jayate.
Om Namo Venkatesaya.
— N Chandrababu Naidu (@ncbn) October 4, 2024