అసలే అధికార పార్టీ. అలాంటప్పుడు అధిపత్య పోరు మామూలే. కింది స్థాయి నేతల మధ్య ఉండటం సర్లేనని అనుకోవచ్చు. కానీ.. పెద్దతలకాయల మధ్య నెలకొన్న పోరు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ ఛార్జిగా వైవీ సుబ్బారెడ్డి.. మాజీ ఇన్ ఛార్జి విజయసాయి మధ్య అధిపత్య పోరు తారాస్థాయికి చేరుకున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామం ముక్కున వేలేసుకునేలా చేసింది. నేతల మధ్య పోరుకు చెక్ పెట్టాలన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో జగన్ ఎంట్రీ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొని ఉందంటున్నారు.
పార్టీ నేతలతో చర్చించిన వైవీ సుబ్బారెడ్డి జోనల్ ఇన్ ఛార్జులుగా కొందరిని నియమించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైంది. దీని సారాంశం..యువజన విభాగానికి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమారుడు ముత్తంశెట్టి వెంకట శివసాయి సందీప్.. మహిళా విభాగానికి విశాఖ పార్లమెంటు నియోజకవర్గ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు పీలావెంకట లక్ష్మిల పేర్లను ఖరారు చేస్తూ.. ఈ నెల 10న ప్రకటన విడుదల చేశారు.
గతంలో ఇదే పదవులకు విజయసాయిరెడ్డి కసరత్తు చేసి.. యువజన విభాగం ఇన్ ఛార్జిగా సునీల్ కుమార్, మహిళా విభాగం ఇన్ ఛార్జిగా విశాఖ నగర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు గౌరి పేర్లను ఫైనల్ చేశారు. అయితే.. ఈ పేర్లపై కొందరు వ్యతిరేకతను వ్యక్తం చేసిన నేపథ్యంలో జోనల్ ఇన్ ఛార్జుల నియమకాన్ని కొద్ది రోజుల పాటు పక్కన పెట్టారు. కొత్తగా ఇన్ ఛార్జిబాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి కొత్త వారిని నియమిస్తున్నారన్న విషయాన్ని విజయసాయి చెవిన వేశారు ఆయన వర్గీయులు. దీంతో.. తాను సూచన చేసిన వారి పేర్లు కాకుండా కొత్త పేర్లు వచ్చే అవకాశం లేదని హామీ ఇచ్చి వెళ్లారు.
అయితే.. విజయసాయి మాటకు భిన్నంగా 10న విడుదలైన ప్రకటనలో పేర్లు వేరుగా ఉండటంతో విజయసాయి అండ్ కో తీవ్రంగా రగిలిపోయినట్లుచెబుతున్నారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఆయన 10న ఇచ్చిన అధికారిక ప్రకటనను రద్దు చేసి.. వారిస్థానంలో సునీల్ కుమార్.. గౌరిలను నియమిస్తూ ప్రకటన చేశారు. అంటే.. వైవీ ఎంపిక చేసిన వారి పేర్లనుకాదని.. రోజులో విజయసాయి చెప్పిన పేర్లను ఫైనల్ చేయటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి విజయసాయి తన పంతాన్ని నెగ్గించుకున్నారని చెబుతున్నారు. ఈ ఆటలో మధ్యలో వచ్చిన ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ కుమారుడ్ని రోజులో తీసేయటం.. ఆయన వర్గీయుల్ని తీవ్రంగా వేధిస్తోందన్న మాట వినిపిస్తోంది.
మరో సంక్షోభానికి చేరువలో వైసీపీ..!! విజయసాయి వర్సెస్ వైవీ సుబ్బారెడ్ల మధ్య ముదురుతోన్న వైరం.
జగన్ కి షాకిచ్చిన విజయసాయి.. బాలీనేని వదిలేసిన పదవి పై మక్కువ లేదంటూ మౌనం.. వైవీ సుబ్బారెడ్డి పై కక్ష తీర్చుకునేందుకు రెడీ అయిన సాయి రెడ్డీ..#PsychoPovaliCycleRavali pic.twitter.com/6kLoZAQUrj
— Sai Bollineni ™ ⭕️ (@saibollineni) May 14, 2023