బీజేపీ,వైసీపీ ఒకటన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అందుకే బీజేపీ MLC ఫలితం..విష్ణు కుమార్
మరి అది పోగొట్టుకోవడానికి ఏదో ఒకటి చేయాలి గదా
అదే స్టార్ట్ చేశారు ఈ రోజు
పక్కా ప్రణాళిక తో బీజేపీ సత్యకుమార్ పై దాడి
ప్రణాలిక BJYCP ది. no doubt pic.twitter.com/HXchzxNrnY
— Chandra Sekhar Puppala (@sekhar1312) March 31, 2023
అమరావతిలో వైసీపీ నేతలు వీరంగం వేశారు. అమరావతి రైతులకు మద్దతిచ్చి.. తనదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై దాడికి తెగబడ్డారు. అద్దాలు ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్
అయితే, వారిపైనా వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోవడంతో.. సత్యకుమార్ భద్రతపై బీజేపీ నాయకులు ఆందోళన చెందారు. ఆయన్ను రక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. చాలాసేపటి తర్వాత అక్కడి నుంచి సత్యకుమార్ ముందుకు సాగిపోయారు. ఉద్దండరాయునిపాలెంలో మూడు రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులే ఈ దాడికి దిగినట్లు బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.
మేం కూడా సిద్ధమే: సత్యకుమార్
సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. దాడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భౌతికదాడులకు సిద్ధమని వైసీపీ నేతలు చెబితే తాము కూడా సిద్ధమేనని అన్నారు. భౌతిక దాడులు చేసి భయపెట్టాలని వైసీపీ చూస్తోందని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తమ కార్యకర్తలపై దెబ్బ పడితే తామూ సమాధానం చెప్పగలమన్నారు. పోలీసులు లేకుండా ఘర్షణకు రండి.. తేల్చుకుందాం.. అని సవాల్ చేశారు. కొందరు తప్పించుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారంటే.. దాడి ఉద్దేశపూ
అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నా. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. అక్కడే ఉన్న పోలీసులు దుండగులను ఎందుకు అడ్డుకోలేదు? pic.twitter.com/oRJVfkZDbE
— N Chandrababu Naidu (@ncbn) March 31, 2023
పోలీసులు సహకరించారు!
దాడులు చేయాలని ఎవరు చెప్పారో త్వరలోనే తేలుతుందని, ఇంత జరిగినా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. దాడికి దిగిన వైసీపీ కార్యకర్తలకు పోలీసులు సహకరించారని ఆరోపించారు. అధికార పార్టీకి తొత్తులుగా మారవద్దని పోలీసు అధికారులను కోరుతున్నాన్నారు. దాడికి ప్రయత్నించిన వారిపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని సత్యకుమార్ కోరారు. దాడి ఘటనను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
వైసిపి గుండాల్లార ఖబర్దార్ – బిజెపి ఆంధ్రప్రదేశ్ మహిళమోర్చ ఉపాధ్యక్షురాలు నాగలక్ష్మి
ఈ రోజు జాతీయ కార్యదర్శి y సత్యకుమార్ గారి పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తూ చట్టం వెంటనే శిక్షించకుంటే తీవ్రమైన ఉద్యమం చేయాల్సి వస్తుంది pic.twitter.com/JKyfkuOWxt
— Naga Lakshmi Sharma.Kari (@naga_kari) March 31, 2023