వైసీపీ అధినేత, సీఎం జగన్ .. తాజాగా ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో ను రిలీజ్ చేశారు. అయి తే.. దీనికి ముందు ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగంలో.. మాటకు కట్టుబడతామని.. మడమ తిప్పబోమని చెప్పారు. అందుకే తాము ఆర్భాటాలకు పోకుండా.. చేయగలిగిందే చెబుతామన్నారు. టీడీపీ అదినేత చంద్రబాబుపై ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. ఆర్భాటాలకు పోయి.. లేనిపోనివన్నీ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. కానీ, ఆయన చెబుతున్న పథకాలు అమలు చేసేందుకు.. లక్షా 72 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని జగన్ చెప్పారు.
ఇక, వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాల మేరకు.. భారీ ఎత్తున ఈ దఫా ఏమీ చెప్పింది లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను మరో ఐదేళ్లు కొనసాగిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం అమలు చేస్తున్న డీబీటీ పథకాలను కొనసాగిస్తామని.. చెబుతూ.. కొంత మొత్తమే వాటికి పెంచారు. ఉదాహరణకు రూ.15000 లుగా ఉన్న అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తూనే దీనిని రూ.17000లకు పెంచారు. అదేవిధంగా ప్రస్తుతం అమలు చేస్తున్న ఈబీసీ నేస్తం పథకాన్ని రూ.60 వేలకు పెంచనున్నారు.
అలానే.. ఆరోగ్య శ్రీని ఎన్నికలకు ముందుగానే రూ.25 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. దీనిని వచ్చే ఐదేళ్లు కొనసాగించనున్నారు. వాహన మిత్ర పథకం కింద ఇప్పటి వరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మాత్రమే రూ.10 వేలుగా ఇస్తున్న ప్రోత్సాహాన్ని.. ఇక నుంచి లారీ, అంబులెన్స్ డ్రైవర్లకు కూడా వర్తింప చేయనున్నా రు. మహిళలకు ఇస్తున్న డ్వాక్రా రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. అంటే.. మొత్తంగా ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలనే జగన్ కొనసాగించినట్టు అయింది తప్ప.. కొత్తగా తీసుకువచ్చింది ఏమీ లేదు. పైగా ఎలాంటి భారీ హామీలు కూడా లేకపోవడం గమనార్హం.
+ సామాజిక పింఛన్లను రూ.3000 నుంచి 3500లకుపెంచనున్నారు.
+ అమ్మ ఒడినిరూ.15000 నుంచి రూ.17000లకు పెంచనున్నారు.
+ ఈబీసీ నేస్తం 45 వేల నుంచి రూ.1.05 వేలకు పెంపు
+ ప్రమాద బీమాను జుమాటో, స్విగ్గీ వంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ బోయ్స్కు కూడా వర్తింప చేయనున్నారు.
+ వైస్సార్ రైతు భరోసా కింద ప్రస్తుతం ఇస్తున్న 12 వేల మొత్తాన్ని రూ.16 వేలకు పెంచనున్నారు.
+ కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు