ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇక నిన్నటి నుంచి తెలుగుదేశం పని అయిపోయింది అని వైకాపా ప్రచారం చేస్తోంది? తెలుగుదేశం అవుట్ అయితే…. దానిని అంతగా తలచుకోవడం ఎందుకు? సత్తువ లేని దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? ఎందుకంటే… వాస్తవం ఏంటో వైసీపీకి తెలుసు.
వైసీపీని స్థానిక ఎన్నికల్లో ఎలా గెలిపించుకున్నారో నేతలకు తెలుసు.వైసీపీని స్థానిక ఎన్నికల్లో ఎందుకు గెలిపించారో ప్రజలకూ తెలుసు.
ఎందుకంటే ప్రజలకు ఎపుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలుసు కాబట్టి వారు సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకుంటారు. మీరు దీనిని నమ్మకపోతే జగన్ తో నే మీకు ఈ విషయాన్ని చెప్పిద్దాం. కింద వీడియో చూడండి.
అర్థమైంది కదా.
2012 ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన తెలుగుదేశం 2014లో ఎందుకు గెలిచింది?
2005లో కూడా తెలుగుదేశం ఒక్క కార్పొరేషన్ గెలవలేదు.
మరి అపుడు టీడీపీ అవుట్ అయ్యిందా?
అంతే ఏ పార్టీ భవిష్యత్తుకు అయినా ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రామాణికం కాదు. అంతెందుకు జగన్ విశాఖను రాజధాని చేస్తాను అన్నా కూడా 40 శాతం ఓటర్లు తెలుగుదేశానికి ఎందుకు వేశారు?
ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచిస్తే ఏపార్టీ భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుంది.