• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మజా : న‌ర‌సాపురంలో గెలిచేదెవ‌రు.. ఓడేదెవ‌రు..!

admin by admin
January 20, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
494
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

న‌ర‌సాపురంలో ఏం జ‌రుగుతుంది?  వైసీపీ గెలుస్తుందా?  ర‌ఘురామ‌రాజు ఓడిపోతాడా?  ఇదీ.. ఇప్పుడు ఏ ఇద్ద‌రు రాజ‌కీయ నేత‌లు క‌లుసుకున్నా జ‌రుగుతున్న చ‌ర్చ‌. దీనికి కార‌ణం… 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. త‌ర్వాత‌.. కొన్ని నెల‌ల‌కే రెబ‌ల్ గా మారిపోయారు.

కార‌ణాలు ఏవైనా.. ఆయ‌న సొంత‌పార్టీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తున్నారు. చివ‌ర‌కు సొంత పార్టీ అధినేత జ‌గ‌న్ బెయిల్ ను ర‌ద్దు చేయాలంటూ.. కోర్టుకు కూడా ఎక్కారు. ప్ర‌స్తుతం ఇది తెలంగాణ హైకోర్టు విచార‌ణ‌లో ఉంది.

అయితే.. ఇదే స‌మ‌యంలో ఏకు మేకుగా మారారంటూ.. ర‌ఘురామ‌పై వైసీపీ కూడా క‌న్నెర్ర చేసింది. అయితే.. నేరుగా ఆయ‌న‌నే ఏమీ అన‌కుండా.. ఆయ‌న పార్ల‌మెంటు అభ్య‌ర్థిత్వంపై వేటు వేయాల‌ని.. పార్ల‌మెంటు స్పీక‌ర్‌కు ఇప్ప‌టికే విన్న‌వించారు. దీనిపై చ‌ర్య‌ల‌కు కూడా వైసీపీ ఎంపీలు తీవ్ర‌స్తాయిలో ప‌ట్టుబ‌డుతున్నారు.

అయితే.. ఇప్ప‌టికీ.. స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ర‌ఘురామే.. స్పందిస్తూ.. త్వ‌ర‌లోనే తాను రాజీనామా చేస్తాన‌ని.. ఈలోగా.. త‌న‌ను అనర్హుడిని చేయాల‌ని స‌వాల్ రువ్వారు. అంతేకాదు.. ఫిబ్ర‌వ‌రి 5న ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని చెప్పారు.

అయితే.. ఈ నెల 31 నుంచి పార్ల‌మెంటు బ‌డ్జెట్ సమావేశాలు ఉన్నందున ఈ స‌మావేశాలు అయ్యాక ఆయ‌న రాజీనామా చేసే అవ‌కాశం ఉంది. ఇదిలావుంటే.. ర‌ఘురామ క‌నుక త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తే.. షెడ్యూల్ ప్ర‌కారం ఆరు మాసాల్లో తిరిగి ఎన్నిక‌లు నిర్వ‌హించాలి. దీంతో వ‌చ్చే సెప్టెంబ‌రు లోగానే న‌ర‌సాపురం ఉప ఎన్నిక వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో ఎవ‌రు విజయం సాధిస్తారు? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాలు.. నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌ను బ‌ట్టి.. ర‌ఘురామ విష‌యంలో క్లారిటీ వ‌స్తే త‌ప్ప‌.. దీనిపై ఎలాంటి నిర్ణ‌యానికీ రాలేని ప‌రిస్థితి వుంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ..  రఘురామరాజు సొంత సత్తా రెండూ కలిపి ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు.

మ‌రి ఈ ద‌ఫా.. ఆయ‌న ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతారా (సంతంత్య్ర అభ్య‌ర్థిగా) లేక‌.. బీజేపీ త‌ర‌ఫున పోటీ చేస్తారా?  లేక జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేస్తారా? ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టి టీడీపీ టికెట్‌పై నిల‌బ‌డ‌తారా? అనేది ఆస‌క్తిగా మారింది. వీటిలో ఏ పార్టీ త‌ర‌ఫున ఆయ‌న పోటీ చేసినా.. వైసీపీ బ‌లంగా ఢీ కొనే అవ‌కాశం ఉంది. అలా కాకుండా.. అన్ని పార్టీలూ ఏక‌మై.. ర‌ఘురామ‌కు మ‌ద్ద‌తుగా నిలిస్తేనే .. వైసీపీ కి బ్యాండ్ తప్పదు.

వాస్త‌వానికి గ‌త 2019 ఎన్నిక‌ల్లో 35 వేల ఓట్లు సంపాయించుకున్న ర‌ఘురామ‌.. గ‌ట్టి పోటీనే ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జ‌న‌సేన అభ్య‌ర్థి నాగ‌బాబు బ‌ల‌మైన పోటీ ఇచ్చారు. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది వైసీపీయేత‌ర పార్టీలు తీసుకునే నిర్ణ‌యంపైనే ర‌ఘురామ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంది.

అదేస‌మ‌యంలో ఈ ఎన్నిక‌లు ప్ర‌భుత్వానికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మార‌నున్నాయ‌నేది వాస్త‌వమే. రెండున్న‌రేళ్ల పాల‌న త‌ర్వాత‌.. అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్న నేప‌థ్యంలో ఈ ఉప ఎన్నిక‌.. అందునా.. పార్ల‌మెంటుస్థాయి ఉప ఎన్నిక కావ‌డం..ఎలాంటి సెంటిమెంటుకు అవ‌కాశం లేక‌పోవ‌డంతో.. వైసీపీకి కూడా ప్ర‌తిష్టాత్మ‌క‌మే. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags: AmaravatibhimavaramBJPjanasenaNarsapurnarsapuramRaghurama rajuTDPWest godavariYSRCP
Previous Post

అంతా పీఏనే చూసుకుంటున్నారా… ఆ మంత్రిపై పేలుతున్న స‌టైర్లు…!

Next Post

వల్లభనేని వంశీపై వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్లు

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post

వల్లభనేని వంశీపై వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్లు

Please login to join discussion

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra