జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్న మాటకు నిలువెత్తు రూపంగా నిలుస్తారు రాంగోపాల్ వర్మ తీరు చూస్తే. తన పుర్రెకు వచ్చే పిచ్చి ఆలోచనల్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ను వాడేసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు తెలిసిందే. తాను ఎవరినైతే లక్ష్యంగా చేసుకోవాలనుకుంటారో.. వారికి సూటిగా తగిలేలా ఆయన ట్వీట్లు ఉంటాయి. తాజాగా వారాహి వాహనం మీద వర్మ అసందర్భ ప్రేలాపనులు చూసినప్పుడు.. వర్మ పైత్యం ఏ స్థాయికి చేరుకుందో అర్థమవుతుంది.
తాను జరిపే రాజకీయ ప్రయాణాలకు.. పర్యటనలకు వినియోగించే వాహనానికి వారాహి అంటూ అమ్మవారి పేరును పవన్ పెట్టుకోవటం తెలిసిందే. అయితే.. వారాహి అమ్మవారు పంది ముఖంతో ఉంటారు. దీనికి తన పైత్యాన్ని చేర్చిన ఆర్జీవో.. వారాహి వాహనాన్ని పంది వాహనంగా ప్రస్తావిస్తూ.. అప్పట్లో నందమూరి తారకరామారావు తన రాజకీయ ప్రచారానికి వినియోగించిన చైతన్య రథాన్ని కుక్కల బండి అన్నారంటూ ఒకే సందర్భంలో తాను టార్గెట్ చేసిన ఇద్దరిని కెలికేశారు.
వారాహి వాహనాన్ని పంది వాహనంగా అభివర్ణిస్తే.. రాజమౌళి సొంత ప్రొడక్షన్ పేరు వారాహి. అంటే.. దాన్ని పంది ప్రొడక్షన్ అంటారా? అన్నది ప్రశ్న. ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురావాలంటే.. ఒక పదాన్ని.. ఒకరి విషయంలో ఇష్టారాజ్యంగా ప్రస్తావిస్తున్నప్పుడు.. అదే తీరులో ఆ పదాన్ని వినియోగించే అందరిని వర్మ టార్గెట్ చేసినట్లే అవుతుంది. ఇష్టం వచ్చినట్లుగా తాగేసి.. తన నోటి దూలను చేతి అక్షరాలతో ట్వీట్లుగా మార్చేయటం.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయటం తెలిసిందే.
ఇవాల్టి రోజున వారాహి వాహనాన్ని పందుల బండి అనేసిన వర్మ.. రేపొద్దున రాజమౌళి ఇంటి సొంత ప్రొడక్షన్ అయిన వారాహి చిత్రం పేరును పంది ప్రొడక్షన్ గా అభివర్ణిస్తే పరిస్థితి ఏమిటి? ఇలా నోటికి వచ్చినట్లుగా అనేసే వర్మ లాంటి మేధావి తీరును ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అందరికిఅందరూ నచ్చాలని లేదు. అలా అని నచ్చని వారిపై నోరు పారేసుకుంటే అంతకు మించిన తేడాతనం ఉండదు. వర్మ తీరు చూస్తుంటే.. ఇలాంటి తేడా కేసు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి.