తొలుత కరోనా వచ్చినపుడు గవర్నమెంట్లు ఎంత చెప్పినా జనాలు కరోనాకు భయపడలేదు. కానీ ఇపుడు గవర్నమెంట్లు చెప్పాల్సిన అవసరం లేకుండా కరోనాకు భయంతో వణుకుతున్నారు.
జనం పిట్టల్లా రాలిపోతుండటంతో గవర్నమెంటు పట్టించుకోకపోయినా మాస్కులు పెట్టుకుంటున్నారు. బెడ్లు లేక, ఆక్సిజన్ లేక జనం నానా ఇబ్బంది పడుతుంటే జనం భయపడి చస్తున్నారు. తిరుమలకు వస్తున్న సందర్శకుల సంఖ్యే దీనికి నిదర్శనం.
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పడిపోయింది. 15 వేల టిక్కెట్లు జారీ చేస్తున్నా అన్నీ బుక్ అవడం లేదు. టికెట్లు బుక్ చేసుకున్న వారు కూడా కొందరు స్వామి దర్శనానికి రాకపోవడంతో భక్తుల రద్దీ కనిపించడం లేదు. సోమవారం 8,292 మంది భక్తులు మాత్రమే స్వామిని దర్శించుకున్నారు.
4,688 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ రూ. 55 లక్షల ఆదాయం లభించింది.