టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ఈ రాజీనామా పుకార్లపై చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితి, ఈ పరిస్థితుల్లో గోరంట్ల తీసుకోబోయే నిర్ణయం వంటి పలు విషయాలపై పోస్టులు పెడుతున్నారు.
పార్టీ ఆవిర్భావం నుండి గోరంట్ల పార్టీలో ఉన్నారని, తొమ్మిది సార్లు పోటీ చేసి ఆరుసార్లు గెలిచారని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా నుండి వచ్చి రాజమండ్రిలో స్ధిరపడిన ఆయన తొలిసారి ఎన్నికల బరిలో దిగినపుడు స్ధానికుడు కాదంటూ విపక్షాలు ప్రచారం చేశాయని, ఆ ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టి అన్ని సార్లు గెలవడం గొప్ప విషయమని కొనియాడుతున్నారు. పార్టీ మీద అభిమానంతో స్థానికేతరుడైన గోరంట్లను అక్కున చేర్చుకున్నారని గుర్తు చేస్తున్నారు.
గోరంట్లకు స్ధానిక నాయకత్వం ఏనాడూ అడ్డురాలేదని, అడపాదడపా వచ్చినా ఆయన సమర్ధవంతంగా ఆ పరిస్థితులను ఎదుర్కొన్నారని అంటున్నారు. ఇన్నాళ్లూ పార్టీ పల్లకీ మోసిన ఆయన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రచారం జరుగుతోందని, కార్యకర్తలు మాత్రమే పల్లకీ మోసేవారని అంటున్నారు. పార్టీపై గోరంట్ల చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారని, కొత్త తరం నేతలు వచ్చినపుడు పాత తరం వారికి ప్రాధాన్యత తగ్గడం సర్వసాధారణం అని చెబుతున్నారు. గోరంట్ల పార్టీకి సేవ చేశారన్నది 100 శాతం వాస్తవమని, అదే సమయంలో పార్టీ కూడా ఆయనకు అవకాశాలు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు..
కోర్టు కేసులు, నోటీసులు, బెయిలు రద్దు టెన్షన్లు, ఆర్ధిక ఇబ్బందులు, వివాస్పద నిర్ణయాలతో అధికార పార్టీ డిఫెన్స్ లో ఉన్న ఈ తరుణంలో బుచ్చయ్య చౌదరి రాజీనామా ప్రచారం ఇటు పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే పార్టీ ప్రజల్లోకి వెళుతోందని, లోకేష్ ఎస్టాబ్లిష్ అవుతున్నారని, ఈ సందర్భంలో పార్టీని గోరంట్ల వంటి సీనియర్లు ఇబ్బందులకి గురిచెయ్యకూడదని హితవు పలుకుతున్నారు.
గోరంట్ల నిర్ణయంతో పార్టీ నష్టపోయినా…సీనియర్ నాయకుడిగా గోరంట్ల పట్ల సానుభూతి కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే తండ్రీ కొడుకులు గోరంట్లను నిర్లక్ష్యం చేశారంటూ టీడీపీ అనుకూల మీడియా కూడా వ్యాఖ్యానిస్తోందని, ఈ తరహా వ్యాఖ్యలు వస్తాయని చౌదరి గారు గమనించి ఉండాల్సిందని అంటున్నారు. గోరంట్లను చంద్రబాబు, అచ్చెన్నాయుడు, పలువురు నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని,అన్నీ సర్దుకుంటే మంచిదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, గోరంట్ల వెళ్ళిపోవాలనుకుంటే..గౌరవంగా సాగనంపుదామని, కానీ, అసలు విషయం ఆయన నోటి వెంట వచ్చేవరకు వేచి ఉందామని అంటున్నారు.
జిల్లా పార్టీ ని నాశనం చేస్తున్న యనముల, రాజప్ప వారి వల్ల పార్టీ నష్టపోతుంది.ఆరోజు ఆ యాజమాన్యం చేసేది సొంత వ్యాపారం సొంత పెట్టుబడి వాళ్ళ ఇష్టమొచ్చినట్లు చేసుకోవచ్చు …..కానీ ఇది సమిష్టి కృషితో నడిచే పార్టీ , అంతరాలు పెద్దలు కాలం చెల్లినవారు అన్నట్లుగా బుచ్చయ్య గారిని అంటున్నారు మరి అదే జిల్లాలో పార్టీ లో ఎన్నో అనుభవించిన యనమల ఏం చేస్తున్నారో ఎవరికైనా తెలుసా ఓడిపోయినా mlc ఇచ్చి మరీ మంత్రిని చేసారు ఇటువంటి వారికంటే బుచ్చయ్య చాలా మెరుగేగా……. మొన్నీమధ్య కూడా సోషల్ మీడియా లో రోజూ వైకాపా నోళ్ళను మూయించాడు , ఎన్నో అనుభవించిన వారెందరో ఇళ్ళలో దూరి కూర్చోలేదా ప్రక్క రాష్ట్రాలలో వ్యాపారాలు చేసుకోవడం లేదా…
Yes. He is an efficient committed senior leader. If he wants to leave the party let the party give him a honorable way out.
Party Ledu Bokka Ledu….Pappu gadu Vadi Ayya Ganneru Pappu gadu oka lekka?