జై గారు: అంశాల వారీగా చూద్దామా
సతీష్ వేమన ఇటీవల చేసిన వ్యాఖ్యలు
1 ) ప్రస్తుత అధ్యక్షుడు/కాబోయే అధ్యక్షుడు పదవుల్లో ఉంటూ,రాబోయే కార్యవర్గం కాన్ఫరెన్స్ సంబంధిత పనులు కన్నా, ఎన్నికలలో ఒక వర్గాన్ని ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారు.
2) చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా 2019 కాన్ఫరెన్స్ చేసాం. సుమారు 3.5 మిలియన్ డాలర్స్ దాతల నుంచి ఒప్పించగలిగాం.
3) నా జమానాలో విస్తృత సహాయ కార్యక్రమాలు జరిగాయి.. ప్రస్తుత అధ్యక్ష/కార్యవర్గానికి జూమ్ కార్యక్రమాలలోనే అత్యధిక సమయం సరిపోతుంది.
4) తానా భవన్ నా కల, ఎప్పటికైనా నా మాట మిత్రుల/కార్యకర్తల సహకారంతో నిలబెట్టుకుంటాను.
5) ‘తానా’ మా శ్వాసగా బతికిన నన్ను, గంగాధర్/జయరాం గారిని అకారణంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.
వివరణ: పాయింట్ల వారీగా
1) మీరు ఇంత వరకు 2021 కాన్ఫరెన్స్ గురించి గాని, తాలూకు ప్రణాళిక గురించి, ప్రతికూల పరిస్థితుల గూర్చి గాని మీరు ఎక్కడన్నా సభ్యుల, కార్యకర్తల నుద్దేశించి గాని బహిరంగంగా మాట్లాడారా. మీ భావాలు పంచుకున్నారా? ఇకపోతే వేలాది సభ్యుల మధ్య ప్రమాణం చేసి (ఆశ్రీత పక్షపాతం చూపించనని) ఈరోజు మీరు, మీ అనునూయులు పదవిలో ఉండి కూడా ఒక వర్గానికి కొమ్ము కాయటం ఏ మాత్రం నిజంకాదా? ఆధారాలు కావాలా?
2) 2019 కాన్ఫరెన్స్ తానా చరిత్రలో శాశ్వతంగా అగ్ర స్థానంలో నిలిచిపోతుంది, తానా ఖ్యాతి దశ దిశలా చాటి చెప్పారు అని మీరు ప్రసంగించటం నిజం కాదా? ఆధారాలు కావాలా? 8 నెలల ముందుగానే 2018 సెప్టెంబర్ లో వందలాది సభ్యులమధ్య వర్జీనియా లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిజం కాదా? ఆ రోజు దాతలు మొత్తంగా 3.5 మిలియన్ ఇస్తామని చెప్పటం నిజం కదా? కన్నార్ప కుండా కరతాళ ధ్వనులు చేసిన మీకు ..ఆధారాలు కావాలా? (కొందరు దాతలు మాట తప్పి ఇవ్వకపోవం నిజం కాదా? అది వారి వారి ఇష్టం)
3) 2017-2019 మధ్య జరిగిన అసంఖ్యాక సహాయ కార్యక్రమాలు/ ప్రణాళిక తో పాటు తానా వెబ్సైటు లోనే భద్రంగా పదిలపరచ బడ్డాయి కదా.. ఇండియా లో ఎన్నో వేదికల మీద మీరుకూడా ప్రత్యక్ష సాక్షం కదా.. ప్రస్తుతం అనేక కారణాల వాళ్ళ 100 మంది కూడా మించని జూమ్ కార్యక్రమాలే ఎక్కువ కదా… ఆధారాలు కావాలా ?
4) తానా భవన్ కట్టటం కోసం జరిగిన నిస్స్వార్ధ ప్రయత్నం నిజం.. కొన్ని సార్లు అనేక కారణాల వాళ్ళ ఆలస్యం అవొచ్చు..కానీ మాటకు కట్టు బడే వున్నాం అని ఉద్ఘాటిస్తున్నాం. ఇలాంటి ఉన్నత/సున్నిత విషయం హాస్యాస్పదంగా ఎవరు ప్రస్తావించినా అది వారి దిగజారుడు తనానికి పరాకాష్ట.. దీనికి ఆధారాలు కావాలా?
5) చివరిగా సంస్థ సబ్యులకు, సగటు తెలుగు వారికి…తానా ఉన్నతికి/ఉచ్చ స్థితికి .. పదవి వున్నా, లేకపోయినా.. ధన/వ్యయ/శ్రమను పెట్టుబడిగా పెట్టి పెద్దలు, అనుభవజ్ఞులు జయరాం/గంగాధర్ గారు ప్రస్తుతం ఏ పదవిలోనూ లేరు .. ఈనాటికి కూడా తమకు నచ్చిన ఆశయాలతో ముందుకు వచ్చిన వర్గం కోసం వారు, సంస్థ అభ్యున్నతి కోసం కష్ట పడుతున్నారు..సభ్యులుగా అది వారి ప్రాధమిక హక్కు. దీనివల్ల మీ బాధేమిటో, వారు లక్ష్యం గా మీరు స్పందించటం ఏమిటో కరోనా కీటకం కన్నా మిస్టరీగా ఉండి మరి.
చివరిగా 2019 డీసీ కాన్ఫరెన్స్ లో వేమన సతీష్ అనే వ్యక్తి నోటి మాట ననుసరించి, కొడాలి నరేన్ గారి దిశా నిర్దేశంలో.. వందలాది నిస్స్వార్ధ కార్యకర్తల నెలలపాటు శ్రమించి, వ్యక్తిగత పనులు త్యజించి, స్వచ్ఛందంగా రక్తం ధారపోసి కట్టిన చారిత్త్రాత్మక కోటపై కూర్చొని చేసుకున్న మీ పట్టాభిషేకం నిజంకాదా? తద్వారా కోట్లాది మంది గుండెల్లో తానా ప్రతిష్టించుకున్న శాశ్వత ముద్ర నిజం కాదా ?
ఇది కార్పొరేట్ సంస్థ కాదు నాయకా.. కార్యకర్తల సంస్థ.. నడిపించేది దాతల డబ్బు, పదవుల్లో వున్నా నాయకులు మాత్రమే కాదు.. అభిమానంతో స్పందించే ప్రతి ప్రవాస తెలుగు గుండె.. పదవులు లేకపోయినా, గ్రూపులు కట్టకపోయినా… సంస్థకు ఎల్లవేళలా విధేయులం.. నిఖార్సయిన కార్యకర్తలం.
లెక్కలు, ఆధారాలు, సమీక్షలు, సర్దుబాట్లు .. నాలుగు గోడల మధ్య కార్యవర్గం చెయ్యవలసిన పని.. అందుకే కదా మీ అందరికి పదవులు. తప్పు చేసిన వారిని చొక్కా పట్టుకు నిలదీయండి.. అంతేకాని నలుగురిలో అసందర్భంగా మాట్లాడి మీ, మా గౌరవాన్ని తక్కువ చేయకండి.