అఫ్ఘన్ వేశ్యల జాబితాను తాలిబన్లు తయారుచేస్తున్నారు.
వారితో ఎంజాయ్ చేయడానికి ఈ పని చేస్తున్నారేమో అనుకుంటున్నారా?
కాదు, వారిని పట్టుకని చంపడం కోసం జాబితా తయారుచేస్తున్నారు.
తాలిబ్లు పోర్న్ సైట్లను వెతుకుతూ అఫ్గన్ల లిస్టును ప్రిపేర్ చేస్తున్నారు.
ఈ వృత్తిలో ఉన్న అప్ఘన్ మహిళలను బహిరంగంగా ఉరితీయడానికి తాలిబన్లు సిద్ధమయ్యారు.
వేశ్యలకు తాలిబన్లు 3 రకాల శిక్షలు వేస్తారు.
- శిరచ్ఛేదం
- ఉరి తీయడం
- రాళ్లతో కొట్టి చంపడం
అఫ్గన్‌లో తాలిబన్ రాజ్యం రాగానే దెబ్బకు ఈ వృత్తి బంద్ అయిపోయింది. మహిళలు బయటకు రాకూడదు, మాట్లాడకూడదు అనే దేశంలో ఇక వేశ్యలా ? కలలో కూడా ఊహించలేం కదా. దానికి అనుగుణంగా వారు ప్రవర్తిస్తున్నారు.
అక్రమ లైంగిక సంబంధం కలిగి ఉన్న మహిళలు 90 వ దశకంలో తాలిబాన్ పాలనలో దారుణంగా హింసించబడ్డారు. ముఖ్యంగా, గత 20 ఏళ్లలో వారి నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి.
నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం జూన్‌లో, మానవ హక్కుల సంస్థలు కాబూల్‌లో వందలాది మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని హెచ్చరించాయి. పాపం ఇపుడు వారి పరిస్థితి ఏమిటో?