నటి శ్రద్ధా దాస్ తన చిన్నతనంలో సన్నగా లేనందుకు తనను బాడీషేమ్ చేసిన వారందరినీ తిప్పికొట్టింది.
తమిళం, తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈ నటి తన అభిప్రాయాన్ని ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది.
శ్రద్దాదాస్ ఆమె బాగా టోన్ చేసిన శరీరం యొక్క చిత్రాలను పోస్ట్ చేసింది
ఆమె ఒక కొటేషన్ కూడా చెప్పిందండోయ్… “ఎవరైనా మీరు చేయలేరని చెబితే.. ఆ పనిని రెండుసార్లు చేయండి మరియు వాటిని ఫొటో లేదా వీడియో కూడా తీయండి.
నా చిన్నతనంలో పాఠశాలలో సన్నగా లేనందుకు నా శరీరాన్ని అవమానించిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు. నా తల్లి నాకు విలువనివ్వడం, నన్ను నన్నగా ఇష్టపడటం నేర్పింది. మీ శరీరాన్ని మీరు ప్రేమించండి.
నేను రోజు యోగా మరియు జుంబా చేయడానికి ఇష్టపడుతున్నాను, అంతేకాదు కడుపు నిండేదాకా ఇంట్లో వండిన రుచికరమైన ఆహారం ఆరగిస్తాను.. అంటోంది ఈ బ్యూటీ.