కేసీఆర్ అండతో ఇంతకాలం రెచ్చిపోయిన జగన్ కాలకేయ సైన్యంపై వైఎస్ షర్మిల అదను చూసి దెబ్బ కొట్టింది.
హైదరాబాదులో ఉంటూ యుట్యూబులు, సోషల్ మీడియా జగన్ ను ప్రశ్నించిన వారిని వారి ఇంట్లో ఆడవాళ్లని అడ్డమైన బూతులు తిట్టిన కాలకేయ సైన్యంపై ఇంతకాలం కేసీఆర్ సర్కారు ఈగ వాలనీయలేదు.
కానీ వారికి ఇపుడు మూడింది. ఇపుడు తెలంగాణలో సర్కారు మారింది. రేవంత్ సర్కారు లో వైస్ సజ్జల రెడ్డి కుమారుడి ఆదేశాలతో ఆంబోతుల్లా ఇంతకాలం అందరి మీద పడి బూతు పురాణం చదివిన వారి బ్యాడ్ టైం మొదలైంది.
వారు హైదరాబాదులో ఉన్నాం, ఇక్కడ కాంగ్రెస్ సర్కారు ఉందన్న సోయి లేకుండా కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై అడ్డమైన బూతులు పేలి ఆమె మానం, పరువుకు భంగం కలిగించడంతో ఆమె నేరుగా కాలకేయ సైన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఎనిమిది మందిపై సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు చేశారు. తప్పుడు రాతలతో తనను మానసికంగా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. షర్మిల ఫిర్యాదు చేసిన వారిలో శ్రీరెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, మేదరమెట్ల కిరణ్ కుమార్, బులుగాకుల రమేష్, పంచ్ ప్రభాకర్ రెడ్డి, ఆదిత్య, సత్యకుమార్ దాసరి, సేనాని, మహ్మద్ పాషా ఉన్నారు.
ఈ ఎనిమిది మందికి నోటీసులు జారీ చేయడమో లేదా అరెస్టు చేయడమో జరుగుతుందని భావిస్తున్నానని షర్మిల అన్నారు. అయితే, ఇప్పటికే తెలంగాణ పోలీసులు వారందరి ఆచూకీ కోసం వేట మొదలుపెట్టారు. అతి త్వరలో వీరంతా ఊచలు లెక్కపెట్టే పరిస్థితి రావచ్చని తెలుస్తోంది.