స్టార్ బ్యూటీ సమంత పర్సనల్ లైఫ్ గురించి మనందరికీ తెలిసిందే. నాగచైతన్యతో కొన్నాళ్లు ప్రేమాయణం నడపడం, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం, నాలుగేళ్లు తిరక్క ముందే విడాకులు తీసుకోవడం వరుసగా జరిగిపోయాయి. ప్రస్తుతం సమంత సింగిల్ లైఫ్ చేస్తోంది. మరోవైపు చైతు విడాకులైన కొద్ది రోజులకే ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో మళ్లీ లవ్ లో పడ్డారు. ఇటీవలె ఈ జంట అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు.
వివాహం అనంతరం శోభిత తన భర్త నాగ చైతన్యను ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించింది. చైతు చాలా కేరింగ్ పర్సన్ అని, తనను అమితంగా ప్రేమిస్తాడని చెప్పుకొచ్చింది. చైతు లాంటి భర్త రావడం తన అదృష్టమంటూ తెగ మురిసిపోయింది. సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలను కూడా పంచుకుంది. అయితే ఇదే తరుణంలో సమంత పెట్టిన తాజా పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే సమంత.. తన పెంపుడు కుక్క సాషా తో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోపై `సాషా ప్రేమకు ఏదీ సాటిరాదు` అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే ఈ పోస్ట్ సమంత శోభితను ఉద్ధేశించే పెట్టిందని నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు. చైతు తనను అమితంగా ప్రేమిస్తాడని శోభిత చెప్పుకురావడంతో.. ఆమెపై సమంత పరోక్షంగా సెటైర్ పేల్చిందని అంటున్నారు. తన కుక్క ప్రేమ ముందు చైతు ప్రేమ దిగదుడుపు అని చెప్పడమే సమంత పోస్ట్ వెనుక ఉన్న పరమార్థమని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.