స్టార్ బ్యూటీ సమంత కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయ్యింది. కానీ పర్సనల్ లైఫ్ లో ఎన్నో స్ట్రగ్గుల్స్ ఫేస్ చేసింది. తన తొలి సినిమా హీరో అయిన నాగ చైతన్యతో ప్రేమలో పడిన సమంత.. 2017లో అతనితో కలిసి ఏడడుగులు వేసింది. అక్కినేని వారింటికి కోడలు అయింది. కానీ నాగ చైతన్యతో సమంత బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లై నాలుగేళ్లు తిరక్క ముందే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చైతు శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడటం, ఎంగేజ్మెంట్ చేసుకోవడం మనందరికీ తెలిసిందే.
సమంత విషయానికి వస్తే.. విడాకుల తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అనేక రకాలుగా ట్రోలింగ్ కు గురైంది. వాటికి తోడు మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి కొన్ని నెలలు కెమెరాకు దూరమైంది. ఇప్పుడిప్పుడే మెంటల్ గా, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా మారిన సమంత.. మళ్ళీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. త్వరలోనే `సిటాడెల్: హనీ బన్నీ` అనే వెబ్ సిరీస్ తో నార్త్ ప్రేక్షకులను పలకరించబోతోంది. నవంబర్ 7 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇక చైతు మాదిరిగానే సమంత కూడా మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని ఆమె ఫ్యాన్స్ ఎంతగానో ఆకాక్షిస్తున్నారు. కానీ సమంత వెర్షన్ మాత్రం మరోలా ఉంది. సిటాడెల్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. ఫస్ట్ టైమ్ తన రెండో పెళ్లి గురించి మాట్లాడింది. `నేను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాను. అయినా కూడా విడిపోయాం. అందుకే రెండో పెళ్లి గురించి ఆలోచించడం లేదు. లైఫ్ లో నాకు మరో వ్యక్తి అవసరం లేదు. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా` అంటూ సమంత చెప్పుకొచ్చింది. మళ్లీ వివాహం చేసుకునే ఉద్ధశమే తనకు లేదని సమంత ఈ సందర్భంగా అందరికీ ఓ క్లారిటీ ఇచ్చింది.