టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` సినిమాను పూర్తి చేశాడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటించింది. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. విజయ్ దర్శకుడు శివ నిర్వాణ తో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోవాలి అనుకోగా.. ఆమె ఇతర ప్రాజెక్ట్స్ కారణంగా నో చెప్పింది. దీంతో ఆమె స్థానంలో సమంతను ఎంపిక చేశారట. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీకి సమంత పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలు ప్రకారం.. సమంత విజయ్ దేవరకొండ సినిమాకు ఏకంగా రూ. 3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. మామూలుగా అయితే సమంత ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల కంటే తక్కువే తీసుకునేది. కానీ ప్రస్తుతం మాత్రం జీఎస్టీ కాకుండా మూడున్నర కోట్లు డిమాండ్ చేస్తుందట
ఇక ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అంతమొత్తం పారితోషికంగా ఇవ్వడానికి నిర్మాతలు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదని టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. కాగా, సమంత, విజయ్‌లు గతంలో `మహానటి` మూవీలో జంటగా నటించారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో సినీనటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2018లో విడుదలై భారీ విజయం సాధించింది. అలాగే సమంత-విజయ్‌ల జోడీకి సైతం మంచి మార్కులే పడ్డాయి.