న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. గ్లామర్ షోకు సంబంధం లేకుండా కేవలం ప్రతిభతోనే స్టార్ హోదాను సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. తమిళనాడుకు చెందిన ఈ ముద్దుగుమ్మ అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంది. కెరీర్ ఆరంభం నుంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంది. లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న సాయి పల్లవి.. గత పదేళ్ల నుంచి ఒకతనితో ప్రేమలో ఉందట. ఈ విషయాన్ని సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. సాయి పల్లవి మాట్లాడుతూ.. మహాభారతం ఇతిహాసంపై తనకెంతో గౌరవం ఉందని, అందులో అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
అభిమన్యుడి గురించి అనేక విషయాలు చదివి తెలుసుకున్నానని.. అలా తెలుసుకునే క్రమంలో అతనితో ప్రేమలో పడిపోయానని సాయి పల్లవి తెలిపింది. ఒకటి, రెండు కాదు పదేళ్ల నుంచి అభిమన్యుడిని ప్రేమిస్తున్నానని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఇక ఈ బ్యూటీ లవ్ స్టోరీ గురించి తెలుసుకుని షాక్ అవ్వడం నెటిజన్ల వంతు అయ్యింది.
కాగా, సాయి పల్లవి ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో చాలా బిజీగా గడుపుతోంది. తెలుగులో నాగ చైతన్యతో కలిసి తండేల్ మూవీలో నటిస్తోంది. తమిళంలో శివ కార్తికేయన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మాణంలో అమరన్ అనే సినిమా చేస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణంతో పాటు మరొక ప్రాజెక్ట్ లో సాయి పల్లవి యాక్ట్ చేస్తోంది.