బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా సోకింది. ఆమెకు కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో పురందేశ్వరి – హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
లాక్ డౌన్ సమయంలో తన ఇంటిదగ్గరే పక్కన ఒక గుడిసె వంటి ఆఫీసు ఏర్పాటుచేసుకుని ఇంటికే పరిమితం అయ్యారు. గోవులు పెంచుకుంటూ, పెరటితోటలో పనులతో కాలక్షేపం చేశారు.
ఇటీవల ఆమెకు బీజేపీలో కీలకపదవి దక్కింది. అనూహ్యంగా దేశంలోనే కీలక పదవి దక్కడంతో ఆమె ఇంటికి, ఆఫీసుకు బంధువులు పోటెత్తారు. ఈ క్రమంలో ఆమె కరోనా బారిన పడ్డారు. రెండ్రోజుల క్రితం ఢిల్లీ కూడా వెళ్లిరావడంతో కరోనా ఎక్కడ సోకిందో తెలియని పరిస్థితి.