ట్రంప్, జోబైడెన్ మధ్య ఫస్ట్ డిబేట్

NRI Sep 30, 2020

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టం - ట్రంప్, జోబైడెన్ మధ్య ఫస్ట్ డిబేట్ - రిపబ్లికన్ అభ్యర్థి బైడెన్, ట్రంప్ ముఖాముఖి - ఒకే వేదికపై బైడెన్, ట్రంప్ వాదనలు

అమెరికా : ఆరోగ్య బీమాను రద్దు చేయాలేదు.. ప్రజలకు ఆరోగ్యసేవలను తక్కువ ధరలో అందించే ప్రయత్నం చేశాం - తాము ప్రజలకు కరోనా విషయంలో మెరుగైన వైద్యం అందించాం - ఒబామా కేర్ పాలసీ నిర్వహణ అంతా సులువు కాదు.. పెద్ద ఖర్చుతో కూడుకున్నది - తాను మాస్క్ ధరించట్లేదనే ఆరోపణలను తప్పుబట్టిన ట్యంప్ - అవసరం ఉంటేనే మాస్క్‌ ధరిస్తాను - జో బిడెన్ తరహాలో తాను ప్రజలకు 200 మీటర్ల దూరంలో ఉండను - డెమొక్రటిక్ పార్టీ 47 ఏళ్ల పాలనలో అగ్రరాజ్యానికి చేసిందేమీ లేదు - భారత్ సహా ఇతర దేశాల్లో కొవిడ్ వల్ల ఎంతమంది మృతిచెందారో బైడెన్‌కు తెలియదా? - గత ఎన్నికల్లో గెలిచాం కనుకే సుప్రీంకోర్టు నియామకాల్లో తమ ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది - అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోంది - తాము అన్ని పారదర్శక విధానాలే అవలంబిస్తున్నాం : రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఒబామా కేర్ పాలసీని అధ్యక్షుడు ట్రంప్ నీరుగార్చారు - ట్రంప్ విధానం వల్లే వేలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు - మహమ్మారి కరోనాను ఎదుర్కొవడంలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - ఒబామా కేర్ పాలసీ రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు - ట్రంప్‌కు ఆరోగ్య రంగంపై అసలు అవగాహన లేదు.. ఎలాంటి ప్రణాళిక లేదు -  ప్రజల ప్రాణాలను కాపాడటంలో నామమాత్రంగా నిధులను వ్యయం చేశారు - ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడానికి ట్రంప్ ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళికలు లేవు : డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్

అక్టోబరు 15న ఫ్లోరిడాలోని మియామిలో, 22న టెన్నెసీలోని నష్‌విల్లేలో రెండో, మూడో విడత ముఖాముఖి చర్చలు జరుగనున్నాయి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.