ఏపీలో రాజకీయ వాతావరణం రోజుకోరకంగా వేడి పుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని.. టీడీపీ చెబుతుం డగా.. ఈ పార్టీతో మిత్రపక్షంగా ముద్ర వేసుకునేందుకు.. వైసీపీ ఓటు బ్యాంకు చీలకుండా చర్యలు తీసుకుంటామని పదే పదే చెబుతున్న జనసేన కూడాఇదే మాట చెబుతోంది. ఇది లాజిక్కు అందడంలేదు. ఏదైనా మిత్రపక్షం కలిసి కట్టుగా ఎన్నికలకు వెళ్తే.. ఏ పార్టీ నుంచైనా ఒకరు మాత్రమే సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. మిగిలిన వారిని డిప్యూటీ సీఎంగా చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే.. వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని వైసీపీని ఓడించాలని భావిస్తున్న జనసేన మాత్రం తామే సీఎం పదవిని కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది.
అయితే.. ఇది అందరికీ తెలిసినా.. తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగానే రంగంలోకి దిగుతారని.. వచ్చేది జనసేన ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. సీఎం పవన్ అయిన తర్వాత.. రాష్ట్రంలో అన్ని శాఖల్లోనూ జవాబు దారీ తనాన్ని తీసుకువస్తామన్నారు. ముఖ్యంగా ధార్మిక సంస్థలు.. హిందూ దేవాలయాలకు సంబంధించి.. సమూల మార్పులు చేస్తామన్నారు.
నిజానికి జనసేనాని పవన్ ముఖ్యమంత్రి కావాలనే డిమాండ్ 2014 నుంచి కూడా ఉంది. అయితే.. ఆయన అప్పట్లో పోటీకి దూరంగా ఉన్నారు. 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా యువత, అభిమానులు పెద్ద ఎత్తున జనసేన అధినేత సీఎం అంటూ.. కామెంట్లు చేశారు. అయితే.. అప్పట్లో ఘోరంగా దెబ్బతిన్నారు. ఇక, ఇప్పుడు 2024 ఎన్నికల సమయానికి వస్తే.. ఒంటరిగా కాకుండా.. పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి.. వైసీపీవ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటానని పవన్ చెబుతున్నారు. తన ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబుతోను.. బీజేపీతోనూ పవన్ అనేక సందర్భాల్లో భేటీ అయ్యారు. చంద్రబాబు ఓకే చెప్పారని సమాచారం. ఇక, బీజేపీ మాత్రం పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించే ఉద్దేశంతో ఇప్పటికిప్పుడు ఏమీ తేల్చడం లేదు. అంటే.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో వీరి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే.. చంద్రబాబు సీఎం అవుతారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మెజారిటీఓటు బ్యాంకు, సీట్లు ఉన్న పార్టీ కాబట్టి.. ఆ పార్టీకే సీఎం సీటు దక్కుతుంది.
అయితే.. ఇది అందరికీ తెలిసినా.. తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కాక రేపుతున్నాయి. మరి ఇదే నిజమని అనుకుంటే.. టీడీపీ పరిస్థితి ఏంటి? అనేది చర్చకు దారితీస్తోంది. ఏదేమైనా.. మరోసారి నాగబాబు తేనె తుట్టెను కదిపారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.