• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బ్రహ్మాజీ భార్య గురించి కొత్త సంగతులు

NA bureau by NA bureau
May 5, 2023
in Movies, Top Stories, Trending
0
bramhaji with mahesh

bramhaji with mahesh

0
SHARES
1.2k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హీరోగా సక్సెస్ కాకపోవడం వల్ల అనుకున్నంత గుర్తింపు రాలేదు కానీ.. తెలుగులో ఉన్న మేటి నటుల్లో బ్రహ్మాజీ ఒకడు. ‘సింధూరం’ సహా లీడ్ రోల్ చేసిన కొన్ని సినిమాల్లోనే బ్రహ్మాజీ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అదే సమయంలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా బ్రహ్మాజీ అదగరొట్టేస్తాడు.

వ్యక్తిగతంగా కూడా బ్రహ్మాజీది ఎంతో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సోషల్ మీడియాలో, బయట ఏదైనా ఫంక్షన్లు జరిగితే ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక బ్రహ్మాజీ వ్యక్తిగత జీవితం కూడా అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటుంది. ఆయన ఆల్రెడీ పెళ్లయి విడాకులు తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె బిడ్డనే తన బిడ్డగా స్వీకరించాడు.

తన భార్య పేరు శాశ్వతి. ఆమెతో బ్రహ్మాజీ ప్రయాణం ఎలా మొదలైందనే విషయంలో అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంది. వెన్నెల కిషోర్ నిర్వహించే ఒక టీవీ షోకు భార్యతో కలిసి హాజరైన బ్రహ్మాజీ ఈ జర్నీ గురించి చెప్పుకున్నాడు.

శాశ్వతితో కొన్నేళ్ల పాటు ప్రయాణం చేశాక తనను పెళ్లి చేసుకోవాలని అనిపించిందట. ముందు ప్రపోజ్ చేసింది కూడా బ్రహ్మాజీయేనట. పెళ్లి సమయానికి తాను ఇండస్ట్రీలో పెద్దగా స్థిరపడలేదని.. ఖర్చులకు కూడా డబ్బులు లేని స్థితిలో ఉన్నానని బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు.

తన పెళ్లి కూడా చిత్రమైన పరిస్థితుల్లో జరిగిందని అతను వెల్లడించాడు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా జరిగిందని.. కృష్ణవంశీ, గుణ్ణం గంగరాజు, రమ్యకృష్ణ లాంటి కొద్ది మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారని బ్రహ్మాజీ తెలిపాడు. కృష్ణవంశీ, రమ్యకృష్ణలే దగ్గరుండి పెళ్లి చేశారని.. తన పెళ్లికి కన్యాదానం చేసింది కృష్ణవంశీయే అని అతను చెప్పాడు.

తమ పెళ్లి జరుగుతున్నపుడే ‘చంద్రలేఖ’ షూటింగ్ జరుగుతుండటంతో ఆ టీంలో ఉన్న వాళ్లంతా ఉదయం 8 గంటలకే ఆర్య సమాజ్‌కు వచ్చి తమ పెళ్లి జరిపించారని.. అనంతపురంలో తన సినిమా షూటింగ్ కోసం రావాలని మోహన్ బాబు చెప్పడంతో పెళ్లయిన వెంటనే ఆయన పంపిన కారులో అనంతపురం వెళ్లి.. మూడు రోజుల తర్వాత తిరిగొచ్చినట్లు బ్రహ్మాజీ వెల్లడించాడు.

పెళ్లయిన వెంటనే షూటింగ్‌కు రావడంతో తనతో పాటు ఆ రోజు గదిని పంచుకున్న ఏవీఎస్.. నీ ఫస్ట్ నైట్ నాతోనే అని చమత్కరించినట్లు బ్రహ్మాజీ వెల్లడించాడు. విడాకులు అయిన అమ్మాయితో పెళ్లి కావడంతో తన ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పలేదని.. కొన్ని రోజులకు క్యాజువల్‌గా ఫోన్ చేసి విషయం చెబితే చాలా బాధపడ్డారని.. చెప్పి చేసుకోవాల్సింది అన్నారని.. అంతకుమించి అభ్యంతర పెట్టలేదని బ్రహ్మాజీ తెలిపాడు.

Tags: brahmajibramhajicomedy actorsTollywood
Previous Post

‘ఆదిపురుష్’కు అది మంచా చెడా?

Next Post

వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ప‌వ‌నే సీఎం :  అదెలా నాగ‌బాబు !

Related Posts

Trending

బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత

September 22, 2023
Top Stories

పొదుపు తగ్గి అప్పు పెరిగి.. 50 ఏళ్లలో తొలిసారి ఇలా!

September 22, 2023
chandrababu vs jagan
Trending

స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?

September 22, 2023
Top Stories

పెద్దల సభలో తనతోపాటు జగన్ పరువు తీసిన సాయిరెడ్డి

September 21, 2023
Trending

చంద్రబాబు కు నిరాశే..కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా

September 21, 2023
Top Stories

అంబటే రెచ్చగొట్టారంటోన్న బాలయ్య

September 21, 2023
Load More
Next Post
pawan kalyan with janasena flag

వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ప‌వ‌నే సీఎం :  అదెలా నాగ‌బాబు !

Latest News

  • బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత
  • పొదుపు తగ్గి అప్పు పెరిగి.. 50 ఏళ్లలో తొలిసారి ఇలా!
  • స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?
  • నేను ఆ టైప్ కాదు.. పుకార్ల‌పై రాముల‌మ్మ క్లారిటీ
  • పెద్దల సభలో తనతోపాటు జగన్ పరువు తీసిన సాయిరెడ్డి
  • చంద్రబాబు కు నిరాశే..కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా
  • అంబటే రెచ్చగొట్టారంటోన్న బాలయ్య
  • జైల్లో చంద్రబాబును చంపే కుట్ర: లోకేష్
  • బాబును కాదు జగన్ ను ఇరికించిన విజయసాయి!
  • నవదీప్ పై కఠిన చర్యలు వద్దన్న హైకోర్టు
  • అంబటిపై తొడగొట్టిన బాలయ్య..సస్పెన్షన్
  • కాలిఫోర్నియాలో ‘జాహ్నవి కందుల’ జ్ఞాపకార్థం క్యాండిల్ ర్యాలీ!
  • ముకుల్ రోహత్గీ వాదనలు నాడు ఒకలా.. నేడు మరోలా..!
  • అంగళ్లు అల్లర్ల కేసులో రేపు విచారణ
  • రేపు శాసన సభలో సమరానికి టీడీపీ సిద్ధం

Most Read

టీడీపీ వజ్రాయుధం ‘నారా బ్రాహ్మణి’ వచ్చేసింది!

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

బే ఏరియాలో చంద్రబాబు కోసం కదం తొక్కిన ఎన్నారైలు!

CBN ARREST-చంద్రబాబు కు మద్దతుగా అమెరికాలో భారీ ర్యాలీ!

చట్టం ప్రకారం బాబు అరెస్టు రద్దు చేయొచ్చు:  CBI మాజీ డైరెక్టర్

జగన్ సర్కార్ పై బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra