వైసిపి జగన్ ముఖ్యమంత్రి పాలనలో బ్రాహ్మణులపై దాడులు పెరిగిపోయాయని బ్రాహ్మణుల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసి బ్రాహ్మణులకు రక్షణ లేకుండా చేసిన జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని టిడిపి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రామప్రసాద్ తెలిపారు.
భీమవరం గునుపూడి శివాలయంలో వైసిపి నాయకునిచే దాడికి గురైన పండ్రంగి పవన్ శర్మను పరామర్శించి సంఘీభావం తెలిపిన అనంతరం మాట్లాడుతూ పూజకు అడ్డంగా ఉన్నారని పక్కకి ఉండమని చెప్పినందుకే పూజారిపై దాడిచేసి తిరిగి కేసు పెట్టడం వైసీపీ పార్టీకే చెల్లిందని ఇదే తరహాలో అంగళ్లు సంఘటనలో చంద్రబాబుపై దాడి చేసి తిరిగి చంద్రబాబుపై హత్యాయత్నం కేసు మోపటం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని తెలిపారు.
ఈకార్యక్రమంలో పాల్గొన్న టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు ఏవి రమణ మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బ్రాహ్మణులకు అనేక సంక్షేమ పథకాలను అమలుచేసి ఆదుకున్నారని జగన్ ప్రభుత్వం వచ్చాక బ్రాహ్మణులకు ఎటువంటి అభివృద్ధి లేకపోగా బ్రాహ్మణులపై దాడులు పెరిగాయని విమర్శించారు.
దాడికి గురైన పవన్ మాట్లాడుతూ నాపే జరిగిన అన్యాయానికి ట్రస్ట్ చైర్మన్ తో రాజీనామా చేయించడంతో న్యాయం జరిగిందనుకోవడం సరికాదని ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా బ్రాహ్మణులకు అవమానం కలగకుండా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు వేలూరి సుబ్రహ్మణ్యశర్మ చెరకుపల్లి సంతోష్ కుమార్ వేలూరి శ్రీధర్ మిర్తిపాటి గున్నేశ్వరరావు బొంతనబట్ల పద్మ పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు గూడూరి సుబ్బారావు టిడిపి నాయకులు ఎద్దు ఏసు పాదం మాదాసు కనకదుర్గ ఎండి షబీనా ఎస్.డి నసీమాబేగం పాలా శ్రీరామదాసు విజ్జురోతి రాఘవులు మల్లువలస రాము యర్ర వెంకట సత్యనారాయణ మద్దుల మూర్తి దొంగ వెంకటేశ్వరరావు భీమనాదం శేషారావు తదితరులు పాల్గొన్నారు.