టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. 2007లో లక్ష్మీ కళ్యాణం మూవీ తో ఈ ముంబై బ్యూటీ హీరోయిన్ కెరీర్ ప్రారంభించింది. అదే ఏడాది విడుదలైన చందమామ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తనదైన అందం అభినయంతో తెలుగువారి హృదయాల్లో చోటు సంపాదించుకోవడమే కాకుండా వరుస అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ లో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇలా దాదాపు స్టార్ హీరోలందరితోనూ కాజల్ ఆడి పాడింది. అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది.
మరోవైపు తమిళంలోనూ అనతి కాలంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది. దశాబ్దన్నర కాలం పాటు అగ్ర తార గా చక్రం తిప్పిన కాజల్.. 2020లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూ ను వివాహం చేసుకుంది. పెళ్లయిన కొంతకాలానికి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇటీవల కాలంలో పెళ్లై పిల్లలు పుట్టిన కూడా ఎంతో మంది హీరోయిన్లు తమ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. వరస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కానీ కాజల్ విషయంలో మాత్రం అలా జరగలేదు.
తల్లి అయిన తర్వాత కాజల్ మునుపుటంతా జోరు చూపించలేకపోతోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో హీరోలు, దర్శకనిర్మాతలు ఆమెను పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితి కనిపిస్తోంది. మంచు విష్ణు కన్నప్పలో కాజల్ నటిస్తున్నప్పటికీ.. అందులో ఆమెది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే. ప్రస్తుతం కాజల్ కి తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. అటు తమిళంలోనూ ఇదే పరిస్థితి. బాలకృష్ణతో నటించిన భగవంత్ కేసరి చిత్రం విజయం సాధించినప్పటికీ.. కాజల్ కు మాత్రం ఒరిగిందేమి లేదు.
యంగ్ జనరేషన్ స్టార్స్ బాలీవుడ్ భామల వైపు మొగ్గు చూపుతున్నారు. సీనియర్ హీరోలు కుర్ర హీరోయిన్లతో జత కడుతున్నారు. యువ హీరోల పక్కన కాజల్ సెట్ అవ్వడం లేదు. దీంతో ఒకప్పుడు చేతినిండా అవకాశాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన కాజల్.. ఇప్పుడు అవకాశాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. ఇదే కంటిన్యూ అయ్యిందంటే మరో రెండు మూడేళ్లలో కాజల్ టాలీవుడ్ లో కనుమరుగైపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.