చాలా రోజుల నుంచి జగన్ వేరు, బీజేపీ వేరు అన్న భావన వచ్చే విధంగా రాజకీయాలు జరుగుతున్నాయి. బీజేపీ కూడా జగన్ ను పెద్దగా పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు ఏవీ లేవు. మోడీ పేరిట రన్ అవుతున్న కొన్ని ఎఫ్బీ పేజీలు జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతున్నాయి. విమర్శనాత్మక ధోరణిలో మాట్లాడుతున్నాయి.గతంలో టీడీపీ విమర్శకు కొనసాగింపుగానే మాట్లాడుతున్నాయి.
జగన్ ది తుగ్లక్ పాలన అని అంటున్నాయి. అయితే వీటి వెనుక బీజేపీ ఉద్దేశం ఏంటన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. గత ఎన్నికల సమయంలో జగన్ చెప్పే మాటలు ఇచ్చే హామీలు అన్నవి బీజేపీకి ఇప్పటికీ నచ్చలేదు. కానీ ఎందుకనో కొన్ని విషయాల్లో జగన్ కు మద్దతు ఇచ్చింది. ముందు వెనుక చూసుకోకుండా జగన్ ఇచ్చిన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి.
ఆ రోజు రాజధాని నిర్ణయంను స్వాగతించి ఇప్పుడు ఎందుకని ఈ నాటకాలు అన్నది చాలా మంది బీజేపీ నాయకులు మీడియా ముఖంగా అడుగుతున్న ప్రశ్న. రాజధాని విషయమై కేంద్రం వరకూ అమరావతి మాత్రమేనని ఫైనాన్షియల్ ఇష్యూస్ ని క్లియర్ చేసేటప్పుడు మొన్నటి వేళ కేంద్రం చెప్పింది.
కొత్త బడ్జెట్ ప్రకారం కూడా కొన్ని నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. జగన్ తో వచ్చిన లేదా వస్తున్న చిక్కు ఏంటంటే నిధుల వరకూ రాజధాని పేరు అమరావతి అని వాడుకుని, తీరా ఆ డబ్బులు సంక్షేమ పథకాలకు ఖర్చు చేసి అటుపై నాటి టీడీపీ సర్కారు నిర్ణయాలను విమర్శిస్తూ పోవడం అన్నది ఎంత మాత్రం తగని పని అని పరిశీలకులు అంటున్నారు.
జగన్ కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుని వాటికి ప్రాంతీయ ఉద్దేశాలు ఉద్వేగాలు జత చేసి మాట్లాడడం కూడా తగదని పరిశీలకులు ఉద్ఘాటిస్తున్నారు. ఈ దశలో జగన్ గెలిచినా ఓడినా ఏమయినా బీజేపీ మాత్రం తన పంథాలో మార్పు ఉండదనే చెబుతోంది.