తన ‘తమ్ముడు’ పవన్ కల్యాణ్ కు అన్ని వేళలా అండాదండగా ఉండే అన్నయ్య నాగబాబు…వైసీపీ నేతలపై, సీఎం జగన్ పై పలుమార్లు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలోనూ జగన్ పాలనపై నాగబాబు మండిపడ్డారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు…తన అభిమానులతో ముచ్చటిస్తూ రాజకీయ, సినీ రంగానికి చెందిన పలు అంశాలపై స్పందిస్తుంటారు. Ask me అంటూ ఫేస్ బుక్ లైవ్ లో అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు.
అయితే, కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేని నాగబాబు..తాజాగా లైవ్ సెషన్ పెట్టి జగన్ పై సెటైరికల్ మీమ్స్ తో విరుచుకుపడ్డారు.
‘ఇక మొదలెడదామా!’ అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో Ask me అంటూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పేరుతో నాగబాబు చాకిరేవు మొదలెట్టారు. మంచు మనోజ్ కు కౌంటర్ ఇవ్వడంతో మొదలుబెట్టిన నాగబాబు..ఆ తర్వాత జగన్ అండ్ కోపై మీమ్స్ తో మంటపుట్టించారు.
‘ఇన్నిరోజులు తరువాత ఆస్క్ మి పెట్టడానికి రీజన్ ఏంటి సార్’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ‘హయ్యర్ పర్పస్’ కోసం అంటూ మంచు మనోజ్ ను ఉద్దేశించి నాగబాబు సెటైరికల్ గా ఆన్సర్ ఇచ్చారు. ఇక, ఏపీ పాలిటిక్స్ పై ఫోకస్ చేసిన నాగబాబు…కోడి కత్తి, గుడివాడలో క్యాసినో, లిక్కర్ బ్రాండ్స్ అంటూ….జగన్ పాలనను ఎండగడుతూ రకరకాల మీమ్స్ తో రెచ్చిపోయారు. ప్రస్తుతం నాగబాబు మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ మీమ్స్ లో విపరీతంగా వైరల్ అయినవి కొన్ని….
‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళి ఏం కత్తి వాడుతున్నారు సార్?
నాగబాబు: కోడి కత్తి! (డైరెక్టుగా చెప్పకుండా కోడి కత్తి ఫొటో పోస్ట్ చేశారు)
‘ఆర్ఆర్ఆర్’ను ఫ్రీగా చూడాలంటే ఎలా?
నాగబాబు: ఎందుకు చూడలేం? చూడొచ్చు… చరణ్ బదులు నాని (పేర్ని నాని?), ఎన్టీఆర్ బదులు శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్?), ఇక దర్శకుడు ఎవరో మీకు చెప్పక్కర్లేదు!
కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశాక మీ అభిప్రాయం?
నాగబాబు: ఆంధ్రా మూడు రాజధానులు ఫైల్స్ అని ఒక సినిమా తీస్తే చూడాలని ఉంది. పోలీస్ కేసులు ఉంటే రాజకీయాల్లో సీట్లు వస్తాయా?
నాగబాబు: ఖైదీలు ముఖ్యమంత్రులు అయిన దేశంలో పోలీస్ కేసులు ఒక లెక్కా?
సామాన్యుడు కోసం తగ్గించాం అన్నారు, ఇప్పుడు పెంచారు (సినిమా టికెట్ రేట్స్). ఈ ప్రభుత్వం ఏంటి?
నాగబాబు: మీరేంటో, మీ విధానాలు ఏంటో నాకు అర్థం కావు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రెస్టారెంట్ సన్నివేశంలో రావు రమేష్ వీడియో పోస్ట్ చేశారు).
సహజ మరణం అంటే ఏంటి?
నాగబాబు: కల్తీ సారా తాగి చనిపోవడం, కత్తులతో గొడ్డలితో గాయపడి చనిపోవడం, పంటలు పండక పురుగుల మందు తాగి చనిపోవడం, గతుకుల రోడ్డు వల్ల ప్రమాదాలు జరిగి చనిపోవడం (సీయం జగన్ వ్యాఖ్యలు, వైఎస్ వివేకా హత్య, ఏపీలో పరిస్థితులపై సీరియస్ కామెంట్ ఇది). మన ముఖ్యమంత్రి పాలన బాగుందంట నిజమేనా?
నాగబాబు: నువ్వు ఈ క్వశ్చన్ నన్ను నిజంగానే అడుగుతున్నావా రాధికా? (డీజే టిల్లు సినిమాలో వీడియో పోస్ట్ చేశారు)