టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎట్టకేలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అదికూడా నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ నుంచే కావడం గమనార్హం. ఈ క్రమంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి.. ఆయన హాజరుకానున్నారు. ఈమేరకు సమావేశానికి రావాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించారు.
అదేవిధంగా ప్రధాని మోడీ కార్యాలయం నుంచి కూడా బాబుకు ఈమెయిల్ వచ్చింది. ఈ క్రమంలో చంద్రబాబు డిసెంబర్ 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి.. చంద్రబాబు హాజరుకానున్నారు. 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు జరగనున్న జీ 20 దేశాల కూటమి సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించనుంది.
రాజకీయ పార్టీల అధ్యక్షులతో.. జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశంలో ప్రధాని మోడీ చర్చించనున్నారు. రాష్ట్రపతి భవన్లో డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సదస్సు జరగనుంది. సదస్సుకు రావాలని చంద్రబాబుకు.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నుంచి ఆహ్వానం అందింది. చంద్రబాబుకు ఫోన్ చేసిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. సమావేశానికి రావాలని ఆహ్వానించడంతో పాటు సమావేశ ప్రాధాన్యతను చంద్రబాబుకు వివరించారు. అదేసమయంలో ఈమెయిల్ రూపంలో ప్రధాని కార్యాలయం కూడా ఆహ్వానించడం గమనార్హం.