ప్రముఖ తెలుగు సినీ నటి మెహ్రీన్ పీర్జాదా (Mehreen Kaur) పెళ్లి ఎంగేజ్ మెంట్ తోనే ఆగిపోయింది.
మార్చి 12 న జైపూర్లోని భవ్యా బిష్ణోయితో తన కుటుంబం మరియు స్నేహితుల సమక్షంలో మెహ్రీన్ పీర్జాదా నిశ్చితార్థం చేసుకున్నారు.
ఈ సంవత్సరం ఈ జంట వివాహం చేసుకోవాలని ఏర్పాట్లు చేసుకుంది. అయితే కరోనా కారణంగా మెహ్రీన్ పెళ్లి అప్పట్లో వాయిదా వేశారు.
అయితే, తాజాగా మెహ్రీన్ పీర్జాదా భవ్యా బిష్ణోయ్ తో తన పెళ్లి రద్దు చేసుకున్నారు. అధికారికంగా చెప్పేసింది.
“భవ్య బిష్ణోయ్ మరియు నేను మా నిశ్చితార్థాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాము. పెళ్లితో ముందుకు పోకూడదు అనుకున్నాం. ఇరువైపులా సామరస్యంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పటి నుండి నాకు భవ్య బిష్ణోయ్, అతని కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో సంబంధం లేదు ”అని మెహ్రీన్ కౌర్ పోస్ట్ చేశారు.
“ఇది నా వ్యక్తిగత విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ నా గోప్యతను గౌరవిస్తారని, ఇంతటితో దీనిని మరిచిపోవాలని ఆశిస్తున్నాను. నా భవిష్యత్ ప్రాజెక్టులతో నేను ముందుకు సాగుతాను‘‘ అని ఆమె పేర్కొన్నారు.
మెహ్రీన్ ఎఫ్ 3 షూట్ లో బిజీగా ఉంది. దీంతో పాటు మరో సినిమాలో కూడా నటిస్తోంది.