తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితమే ఆయన మొదటి కుమారుడు బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన రెండో కుమారుడు కూడా మరణించారు.
మాగంటి బాబుకు ఇద్దరు కుమారులు. పెద్ద వాడు రాంజీ. అతనికి భార్య, ఒక సంతానం ఉన్నారు. రెండో కొడుకు రవీంద్రనాథ్. అన్న మరణంతో అతను చాలా కోల్పోయారు. సడెన్ గా రెండో కొడుకు కూడా మరణించడంతో కుటుంబం షాక్ లోకి వెళ్లిపోయింది.
రవీంద్ర ఇటీవల తాగుడుకు బానిసయ్యారు. తాగుడు అలవాటును తప్పించడానికి ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చి బంజారాహిల్స్ లోని హయత్ హోటల్ లో ఉన్నారు రవీంద్ర. అక్కడ బ్లడ్ వామిటింగ్ తో మరణించారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఉన్న ఇద్దరు కొడుకులు చిన్నవయసులో మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటు. ఇలాంటి విషాదం ఎన్నడూ ఏ రాజకీయ ప్రముఖుడి ఇంట జరగలేదు. తెలుగుదేశం పార్టీలో ఇది అత్యంత సంచలనం అయ్యింది.
మాగంటి బాబు రెండో కొడుకు మరణవార్త విని చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి దేవుడు ఇవ్వాలని కోరుకున్నారు.