నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు మొదలు తాజాగా గుంటూరు జిల్లా జైలుకు తరలించడం వరకు పలు నాటకీయ పరిణామాలు జరిగిన సంగతి తెలిసిందే. రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ ఎంపీ పైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటే సామాన్యుల పరిస్థితి ఏమిటనం పౌరహక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రఘురామ ఒంటిపై దెబ్బలు ఎలా వచ్చాయో సీఐడీ అధికారులు చెప్పాలంటున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ పై రఘురామరాజు సతీమణి రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు రాత్రి తన భర్తను చంపాలని కొందరు చూస్తున్నారంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఏపీలో ఏం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదని, మర్డర్లు చేసినవారుకూడా రోడ్లపై తిరుగుతున్నారని,కానీ, ప్రజా సమస్యలపై ప్రశ్నించేవారిని జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన
భర్తను బాగా కొట్టారని, రమేశ్ ఆస్పత్రికి తరలించాలన్న కోర్టు నిబంధనలు కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు.
మరోవైపు, మీడియాపై దేశద్రోహం, కుట్ర కేసులు బనాయించడం వంటి వ్యవహారాలు చూస్తుంటే ఏపీలో నియంత పాలన సాగుతోందని అనిపిస్తోందంటూ పలు ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. సుప్రీం తీర్పులను ధిక్కరించి మరీ ఏపీ సీఐడీ అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నేనారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఐపీసీ, రూల్ ఆఫ్ లా లేదని మండిపడ్డారు.