తన పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశానని సీఎం జగన్ చెబుతుంటారు. ఇక, ఆ వర్గాల ప్రజలకు వైసీపీ పాలన స్వర్ణయుగమని ఆ పార్టీ నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా డప్పు కొడుతుంటారు. బ్యాక్ బోన్ క్లాసులంటూ బీసీలను కాకా పట్టేస్తుంటారు వైసీపీ నేతలు. అయితే, జగన హయాంలోనే ఎస్సీలపై దాడులు, అన్యాయాలు, అక్రమాలు ఎక్కువయ్యాయని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. డాక్టర్ సుధాకర్ కేసు మొదలు ఇటీవల దళిత మహిళపై గ్యాంగ్ రేప్ వరకు ఎన్నో ఘటనలు ఇందుకు నిదర్శనమి దుయ్యబడుతుంటారు.
ఈ క్రమంలోనే ఆ విమర్శలకు ఊతమిచ్చేలా జగన్ సర్కార్ చేసిన మరో పని విమర్శల పాలవుతోంది. ఎస్సీ యువతను మోసగించిన వైసీపీ నేత యాతం క్రాంతికి వైసీపీ సోషల్ మీడియా విభాగంలో కీలక పదవిని కట్టబెట్టిన వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీ నిరుద్యోగ యువతకు, ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ఇప్పిస్తానని నమ్మించిని క్రాంతి వారి నుంచి లక్షలాది రూపాయలు దండుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం ఇప్పించకుండా వారిని మోసం చేశాడు. ఆ కేసులో చీరాల కోర్టు క్రాంతికి 15 రోజుల రిమాండ్ కూడా విధించింది. దీంతో, వైసీపీ నేతలు, జగన్ పై విమర్శలు వస్తున్నాయి.
జగన్ రెడ్డి దొంగల ముఠా సభ్యుడు, వైసీపీ ఎంపీలకు అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత యాతం క్రాంతికి వైసీపీ సోషల్ మీడియా విభాగంలో రాష్ట్ర స్థాయి పదవి కట్టబెట్టడం జగన్ కే చెల్లిందని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. ఇదేనా నువ్వు చెప్పే “నా ఎస్సీలు” అంటే జగన్ రెడ్డి ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ లతో క్రాంతి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.