ఏపీ మంత్రులకు, వైసీపీ నేతలకు ఓ గొప్ప వరం ఉంది. వారు గతాన్ని ఈజీగా మరిచిపోతారు.
అయితే, అదెలాంటి మతిమరుపు అంటే వారు తమ తప్పులు, తమ బూతులు మాత్రమే మరిచిపోతారు.
కానీ ప్రతిపక్షాలవి మాత్రం బాగా గుర్తుంటాయి.
తాజాగా ఏపీలో వరదలకు పంటలు పాడై రైతులు నాశనం అవుతుంటే ఆ పని చేయాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మీద పడి ఏడ్చారు. విచిత్రం ఏంటంటే… ఈయనను మంత్రిని చేసింది మెగా కుటుంబం.
ఇక కన్నబాబు పేల్చిన జోకులు మామలూగా లేవు.
- పవన్ కల్యాణ్ ఒక పార్టీకి వ్యవస్థాపకుడై ఉండి కులాలు ఆపాదిస్తూ పబ్లిక్‌లో మాట్లాడతారా? – కురసాల కన్నబాబు
- మంత్రులను సన్నాసులంటున్న పవన్ కల్యాణ్‌కు సంస్కారం ఉందా? – కురసాల కన్నబాబు
- సీఎం వైఎస్ జగన్.. కులం, మతం, రాజకీయం చూడబోమని చెప్పి అదే రీతిలో వ్యవహరిస్తున్నారు – కురసాల కన్నబాబు
- నిర్మాతలు, దర్శకులకు కూడా పవన్ కల్యాణ్ కులాన్ని ఆపాదించడం విచారకరం – కురసాల కన్నబాబు
- దేశంలో హుందాతనంతో వ్యవహరిస్తున్న తక్కువ మంది నాయకుల్లో సీఎం వైఎస్ జగన్ ఒకరు.
ఈ జోకులు ఎంత వైరల్ అవుతున్నాయో చెప్పనక్కర్లేదు. ఈ పాటికి మీకు విషయం అర్థమై ఉంటుంది. మరి కన్నబాబు వీటికి కూడా సమాధానాలు చెబితే బాగుంటుంది.
నిమ్మగడ్డకు మీడియా సాక్షిగా కులం ఆపాదించింది ఎవరు కన్నబాబు కాస్త చెబుతావా?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును, ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబును కొడాలి నాని, సాయిరెడ్డి బూతులు తిడుతుంటే అపుడు అది సంస్కారం కాదని నీకు అనిపించలేదా?
950 మంది రెడ్లకు పదవులు కట్టబెట్టిన జగన్ కి కులపిచ్చి లేదంటావు, చర్చిలకు డబ్బులు ఇచ్చి, గుళ్లో ప్రసాదం, పార్కింగ్, గదుల రేట్లు పెంచిన జగన్ కి మత పిచ్చి లేదంటావు.
మాట్లాడేముందు కాస్త చూసుకోవాలి కదయ్యా… ఎవరైనా ఏమైనా అనుకుంటారనే విషయం కూడా తెలియకపోతే ఎలా?