తనకు అనిపించింది.. అనిపించినట్లుగా మాట్లాడటం.. అది కూడా వీర నాటుగా మాట్లాడేందుకు ఎలాంటి మొహమాటం లేని ప్రముఖుల్లో క్వీన్ కంగనారౌనత్ ముందుంటారు. సినిమా.. రాజకీయాలే కాదు సామాజిక అంశాల మీద తనకు అనిపించింది చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడని ఆమె.. తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. జనరేషన్ జెడ్ మీద విరుచుకుపడిన ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
1997 – 2012 మధ్య పుట్టిన వారిని జనరేషన్ జెడ్ అంటారన్న విషయం తెలిసిందే. వీరి గురించి ఆమె పెట్టిన పోస్టును చూస్తే.. వారి మీద ఉన్నట్లుండి కంగనాకు అంత కోపం ఎందుకు వచ్చినట్లు? అన్నది ప్రశ్నగా మారక తప్పదు. ఇంతకీ కంగనా ఏమన్నది చూస్తే.. జనరేషన్ జెడ్ వాళ్లకు క్రమశిక్షణ.. హార్డ్ వర్కుతో ఎదగటం ఎంత మాత్రం ఇష్టం ఉండదని.. షార్ట్ కట్స్ లో సక్సెస్ పొందినోళ్లనే గౌరవిస్తారని నిప్పులు చెరిగింది.
ఒకరితో కలవటం.. మాట్లాడటం ఇష్టం ఉండదని.. చదవటం కంటే కూడా ఫోన్ లో ఎక్కువగా గడుపుతారని.. వారి మనసులు కూడా స్థిరంగా ఉండవని చెప్పింది. వారి కాళ్లు కర్రల మాదిరి ఉంటాయన్న ఆమె.. వీరు ఆఫీసులో బాస్ లను గౌరవించరు.. కానీ..తమకు ఆ పొజిషన్ కావాలని మాత్రం కోరుకుంటారన్నారు. స్టార్ బక్స్.. అవోకాడో టోస్టులను ఇష్టపడతారు కానీ.. సొంతంగా ఇళ్లు కొనుక్కునే స్థోమత ఉందని పేర్కొంది.
బ్రాండెడ్ దుస్తులు రెంటుకు తీసుకుంటారే తప్పించి.. కమిట్ మెంట్ కానీ పెళ్లిని కానీ ద్వేషిస్తారని పేర్కొంది. ఇతరులను అట్రాక్ట్ చేస్తారన్న ఆమె.. చివరకు సెక్సు విషక్ష్ంలోనూ వారు మహా బద్ధకంగా వ్యవహరిస్తారని పేర్కొంది. ఈ విషయాన్ని తాను మాత్రమే చెప్పటం లేదని.. పలు అధ్యయనాలు కూడా అదే విషయాన్ని చెప్పినట్లుగా పేర్కొంది. మనలో మన మాట.. ఉన్నట్లుండి జనరేషన్ జెడ్ వాళ్ల ముచ్చట కంగనాకు ఇప్పుడు గుర్తుకు రావటం ఏమిటి? అసలేమైందంటారు?