ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పొలిటికల్ ఛేంజ్ స్పష్టంగా కనిపిస్తోం దా? ఇక్కడ మార్పు దిశగా ప్రజలు ఆలోచన చేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ నాయకురాలు, బీసీ మహిళ, మంత్రి ఉష శ్రీచరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తనకే టికెట్ దక్కుతుందని ఆమె ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఇక్కడ పరిణామాలు క్షేత్రస్థాయిలో భిన్నంగా కనిపిస్తున్నాయి.
ప్రధానంగా పార్టీ నుంచి, మరోవైపు ప్రజల నుంచి కూడా మంత్రి ఉష శ్రీచరణ్‌కు సెగ తగులుతోంది. పార్టీ లో ఆమెకు వ్యతిరేకంగా వర్గ పోరు పెరిగింది. కీలక నాయకుడు బోయ తిప్పేస్వామి వచ్చే ఎన్నికల్లో టికె ట్ను ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర వైసీపీ కార్యదర్శిగా ఉన్నా.. నియోజకవర్గంలో మాత్రం విస్తృ తంగా పర్యటనలు చేస్తున్నారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చుట్టేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని చెబుతున్నారు.
ఇదేసమయంలో ఆయన అండర్ కరెంట్‌గా మంత్రి అవినీతి చేస్తున్నారని.. భూముల కబ్జా చేస్తున్నారని లీకులు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి ఉష శ్రీచరణ్ ఇటీవల మీడియాతో మాట్లా డుతూ.. తన పార్టీలోనే కొందరు సెగ పెడుతున్నారని.. వారికి ఎలా బుద్ధి చెప్పాలో తనకు తెలుసునని అన్నారు. ఈ అంతర్గత వివాదం ఇలా ఉంటే.. మరోవైపు మంత్రికి వ్యతిరేకంగా ప్రజల్లోనూ సెగ రగులు తోంది. ప్రస్తుతంనియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడం ప్రధానంగా చర్చకు వస్తోంది.
ఇటీవల మంత్రి తన నియోజకవర్గంలో బైక్‌పై పర్యటించారు. ఇది మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దీనికి కారణం.. నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో అసలు రోడ్లే లేకపోవడం.. ఆయా గ్రామాలకు లేదా పంచాయతీలకు వెళ్లాలంటే.. బైకులు లేదా.. నడక మార్గమే గతికావడం. ఇక, కరెంటు లేని గ్రామాలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇలాంటి సమస్యలకు తోడు రాజకీయంగా కూడా.. కళ్యాణదుర్గం వైసీపీలో కథ మారుతున్నట్టే ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.