మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా బెంజ్ కారు గుట్టును టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రట్టు చేశారు. ఈ మధ్య పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న రోజాకు జేసీ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎవరూ చనిపోయినా కూటమి ప్రభుత్వందే తప్పంటూ శవరాజకీయాలకు చేస్తున్న వైసీపీపై తిరుమలలో జరిగిన దుర్ఘటన కేంద్రంగా జేసీ ప్రభాకర్ మండిపడ్డారు.
వైసీపీ హయాంలో జరిగిన దుర్ఘటలన్నింటినీ ఓ ఫ్లెక్సీగా రూపొందించి మీడియా ముందు ప్రదర్శించారు. ఆ దుర్ఘటనలు జరిగినప్పుడు, వేలల్లో జనాలు చనిపోయినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లని జగన్ అండ్ కో.. ఇప్పుడు ఎక్కడ శవాలు కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారని జేసీ సెటైర్స్ పేల్చారు. అలాగే రోజాకు కూడా ధీటుగా జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
శ్రీవారి దర్శన్ టిక్కెట్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్నారని జేసీ ఆరోపణలు చేశారు. తైతక్కలాడుకుండూ రాజకీయాల్లోకి వచ్చిన నీవు.. ప్రతిదానికి తగుదునమ్మా అంటూ మాట్లాడతావు. నోరు అదుపులో పెట్టుకో అంటూ హెచ్చరించారు. దర్శనానికి వెళ్లిన ప్రతిసారి వందలాది మందిని వెంట తీసుకెళ్లేదని.. ఆమె చేసిన టిక్కెట్ల స్కామ్‌పై దర్యాప్తు చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
అనంతపురం కోర్టులో రోజా మీద చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని ఈ సందర్భంగా జేసీ గుర్తుచేశారు. జగన్ పాలనలో వైసీపీ నేతల వల్ల తాము అనేక ఇబ్బందులు పడ్డామని.. కానీ చంద్రబాబు మాత్రం వాళ్లను గాలికి వదిలేశారని.. తప్పంతా చంద్రబాబుదే అని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జేసీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.