పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ ఇంటివాడైతే చూడాలని దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి కుటుంబ సభ్యులు, అభిమానులతో పాటు టాలీవుడ్ మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లిపై ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ.. అవి చివరకు గాసిప్స్ గానే మిగిలిపోయాయి. అయితే తాజాగా ప్రభాస్ పెళ్లిపై ఆయన క్లోజ్ ఫ్రెండ్, అత్యంత సన్నిహితుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బిగ్ హింట్ ఇచ్చారు. `గేమ్ ఛేంజర్` ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య హోస్ట్ చేస్తున్న `అన్ స్టాపబుల్` సీజన్ 4 లో రామ్ చరణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చరణ్ వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో ఫోన్ సంభాషణ హైలైట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే బాలయ్య ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. చరణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడట. ప్రభాస్ పెళ్లాడబోయేది తూర్పు గోదావరి జిల్లా గణపవరం పట్టణానికి చెందిన అమ్మాయి అని చరణ్ చెప్పి చెప్పనట్లుగా చెప్పాడట.
చరణ్ వ్యాఖ్యలతో అమ్మాయి రెడీగా ఉందన్న విషయం బయటపడింది. పదహారు అణాల తెలుగు అమ్మాయిని ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో న్యూస్ ట్రెండ్ అవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, ప్రస్తుతం ప్రభాస్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ యాక్ట్ చేస్తున్న `రాజా సాబ్` త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే `సీతారామం` ఫేమ్ హను రాఘవపూడితో ఒక సినిమా, సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమాకు డార్లింగ్ కమిట్ అయ్యి ఉన్నాడు. మరోవైపు సలార్ 2, కల్కి 2 చిత్రాలు కూడా లైన్ లో ఉన్నాయి.