విలక్షణ దర్శకుడు శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 186 కోట్లు వసూళ్లు చేసిందంటూ చిత్ర ప్రొడక్షన్ టీం అఫీషియల్ గా ప్రకటించింది. అయితే, ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుందని అంటున్నారు.
మహా అయితే 86 కోట్లు వసూలు చేసి ఉంటుందని, కానీ, మరీ ఇంత ఎక్కువ చేసి చూపడం ఏంటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మామూలుగా అయితే, 5-10 కోట్లు కలుపుకొని చెప్పడం సహజమని, కానీ, ఈ స్థాయిలో చెప్పడం ఏంటని కామెంట్లు చేస్తున్నారు. చరణ్ పై కొందరు హీరోల అభిమానులు నెగెటివ్ గా ట్రోలింగ్ చేస్తున్నారని, సినిమాకు ఫ్లాప్ టాక్ తెస్తున్నారని కొందరు అంటున్నారు. అయితే, ఎంత నెగెటివ్ ప్రచారం జరిగినా సినిమా బాగుంటే కలెక్షన్లు వస్తాయని చెప్పారు. ఏది ఏమైనా…గేమ్ ఛేంజన్ తొలి రోజు కలెక్షన్ల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.