అంటే అన్నామని అంటారు. తప్పులు చేస్తే వేలెత్తి చూపించటం కూడా పాపం అన్నట్లుగా మారింది. దేశంలో మరే రాష్ట్రంలో లోని విచిత్రమైన పరిస్థితి ఏపీలో నెలకొంది.
రెండేళ్లుగా అధికారంలో ఉండి కూడా.. వైద్య రంగాన్ని విపరీతంగా నిర్లక్ష్యం చేసి.. ఏడాది క్రితం కరోనాతో ఆగమాగమైన తర్వాత కూడా ఫ్యూచర్ కు అవసరమైన ఏర్పాట్లు చేసుకోని జగన్ నిర్ణయ లోపం.. సెకండ్ వేవ్ ఏపీని ఎంతలా వేధించిందో తెలిసిందే. పక్కనున్న తెలంగాణలో కేసుల తీవత్ర తగ్గినా.. ఏపీలో మాత్రం ఇంకా కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. భారీగా కేసుల నమోదు.. మరణాలు ఎక్కువగా నమోదవుతున్న వేళ.. ఆసుపత్రుల్లో వైద్యం అందక.. వాహనాల్లో పక్క రాష్ట్రాల్లో వైద్యానికి వెళ్లటం..సరిహద్దుల వద్ద ఆపేసిన వైనం ఏపీ ప్రజల మనసుల్ని బలంగానే తాకింది.
అన్ని ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్లు.. ఏపీలో సంపదకు కొదవ లేదు. ప్రజలు సంపన్నులే అయినా.. రాష్ట్రం ఆర్థికంగా బలహీనమైన వేళ.. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. అవేమీ పట్టని జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో వేలాది కోట్లను పప్పు బెల్లాలుగా ఖర్చు చేస్తూ.. ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర తీసింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ రోజు (సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 14 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరో రెండు మెడికల్ కాలేజీల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. అంటే.. మొత్తంగా 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మరికొద్ది సంవత్సరాల్లో ప్రారంభించనున్నారు.
ఇలాంటివి ఇంతకు ముందే చేసి ఉండాల్సిందే. జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని తవ్వుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ఏర్పాటు చేయటం మంచిదే అయినా.. శంకుస్థాపన కార్యక్రమానికే.. ప్రారంభోత్సవ కార్యక్రమం అన్నట్లుగా హడావుడి చేస్తున్న తీరు విస్మయంగా మారింది.
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు పచ్చ మీడియా అంటూ విరుచుకుపడే పత్రికల్లో ఒక దానికి జాకెట్ యాడ్ ఇవ్వటం గమనార్హం. ప్రభుత్వం చేసే పనులకు మించిన ప్రచారాన్ని సొంతం చేసుకోవాలన్నట్లుగా ఉన్న తపనను పలువురు తప్ప పడుతున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని శరవేగంగా పూర్తి చేసిన తర్వాత.. భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నా ఎవరూ తప్పు పట్టరు. అందుకు భిన్నంగా శంకుస్థాపనకే ఇంత హడావుడా? అన్నది ప్రశ్న.
ప్రభుత్వ ఖజానాలో కాసులు లేక ఊసురు మంటున్న వేళ.. ఆచితూచి అన్నట్లు ఖర్చు చేయాల్సింది పోయి.. ఇష్టారాజ్యంగా ఈ ప్రకటనల ఖర్చేందన్నది అసలు ప్రశ్న.