దావోస్ పర్యటనకు వెళ్తూ వెళ్తూ అకస్మాత్తుగా లండన్ లో జగన్ ల్యాండ్ అవ్వడాన్ని టీడీపీ తప్పు పడుతోంది. లండన్ వెళ్లేందుకు ఆయనకు ఏమయినా అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నిస్తోంది. ఈ మేరకు మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడుతో సహా పలువురు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.
కోర్టు అనుమతి లేకుండానే ఆయన లండన్ పర్యటనకు ఎలా వెళ్తారని ప్రశ్నిస్తోంది. ఒకవేళ కోర్టు అనుమతించినా ఆ వివరం ఎందుకు వెల్లడి చేయలేదని కూడా ప్రశ్నిస్తోంది. మరోవైపు జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ మరోలా అంటోంది. ఎయిర్ ట్రాఫికింగ్ కారణంగానే ఆయన అక్కడ ల్యాండ్ కావాల్సి వచ్చిందని అంటున్నారు.
మనీ ల్యాండరింగ్ ఓ కారణమా ?
లండన్ పర్యటనకు మరో కారణం కూడా వెతికారు టీడీపీ నాయకులు. అక్కడే తన స్నేహితుడు నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్నారు అని, మనీ ల్యాండరింగ్ లో భాగంగానే అక్కడ ఆగి ఉంటారని అంటున్నారు ఇంకొందరు. వాస్తవానికి ఆస్తుల కేసులో నిమ్మగడ్డతో పాటే ఇంకొందరు కూడా ఇరుక్కున్నారు. లండన్ కేంద్రంగా తాజాగా ఏమయినా వ్యాపార లావాదేవీలు మొదలు పెట్టేందుకు యోచిస్తున్నారా అన్న సందేహం కూడా ఒకటి టీడీపీ నుంచి మరియు జనసేన నుంచి కూడా వస్తోంది.
ప్రజాధనం దుర్వినియోగం చేశారా ?
సొంత పనుల కోసం స్పెషల్ ఫ్లైట్లు ఎలా వాడుకుంటారని యనమల ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఈ రహస్య ప్రయాణం వెనుక ఉన్నదెవరు అని కూడా నిలదీస్తున్నారు. దావోస్ కు పోయి ఏం సాధించుకుని వస్తారో అన్నది కూడా చూస్తామని, ఇప్పటిదాకా విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో జగన్ సర్కారు వెనుకంజలో ఉందని, తమ దారిలో నడిచి అయినా సరే రాష్ట్ర ప్రగతికి సహకరించి పనిచేస్తే మంచి ఫలితాలే వస్తాయని టీడీపీ నాయకులు పదే పదే అంటున్నారు.
E190 ఫ్లైట్ వస్తుందని సమాచారం ఇచ్చారు.
ఇది ముందే ప్రీ ప్లాన్డ్ టూర్.. మే 17నే సమాచారం ఉంది.
ఇప్పుడు ఏమి చెప్తావ్ బుగ్గన ? చెప్పు ఏ బుర్ర కధ చెప్తావో.. 2/2@BugganaRaja
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 22, 2022