మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడని గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ తో తేజ్ ప్రేమలో పడ్డాడని.. త్వరలోనే వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 2021లో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు, ప్రస్తుత అడంపూర్ ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ కు నిశ్చితార్థం జరిగింది.
అయితే వీరు పెళ్లి వరకు వెళ్లకుండానే విడిపోయారు. ఆ తర్వాత మెహ్రీన్ సాయి ధరమ్ తేజ్ తో రిలేషన్ స్టార్ట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. గతంలో సాయి ధరమ్ తేజ్, హెహ్రీన్ జంటగా జవాన్ అనే మూవీలో నటించారు. ఈ సినిమాతో ఏర్పడిన పరిచయమే క్రమంగా ప్రేమగా మారిందట. ఇక ఇప్పుడు ఈ జంట తమ రిలేషన్ ను పెళ్లిగా మార్చాలని భావిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ వార్తలపై తాజాగా సాయి ధరమ్ తేజ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. హీరోయిన్ మెహ్రీన్ తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అని తేల్చేసింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదని..పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే మేమే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని తేజ్ టీమ్ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. దీంతో నెట్టింట జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడింది.