ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారా..? అందుకే బెదిరింపులకు పాల్పడుతున్నారా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారం చేపట్టిన జగన్.. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు గెలుచుకుని చారిత్రాత్మక పరాజయాన్ని మూటగట్టుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు వైసీపీలో కీలక నాయకులంతా ఒక్కొక్కరిగా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మొదటికి మొన్న జగన్ కు అత్యంత సన్నిహితుడు, వైసీపీలో నెంబర్ 2 పొజిషన్ లో చక్రం తిప్పిన నేత విజయ్ సాయి రెడ్డి కూడా పార్టీని వీడారు.
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులను వైసీపీలోకి ఆహ్వానించడం ప్రారంభించారు. మరోవైపు ప్రజల్లో సింపథీ కోసం జైలు కార్డు ఉపయోగించేందుకు జగన్ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్నారు. అధికారాలను ఆయన బెదిరిస్తున్నారని సీబీఐ కోర్టులో పిటిషన్ పడితే తక్షణమే ఆయన బెయిల్ రద్దు అవుతుంది. ఈ విషయం జగన్ కు బాగా తెలుసు. అయినా సరే ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి అధికారులపై అయినా బెదిరింపులకు పాల్పడుతున్నారు.
మంగళవారం కూడా బెంగళూరు నుంచి విజయవాడ వచ్చిన జగన్.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాకత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్ అధికారులకు ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. అక్రమంగా వంశీపై కిడ్నాప్ కేసు పెట్టి అరెస్ట్ చేశారని.. పోలీసులు ప్రభుత్వం పెద్దలకు అనుకూలంగా మారారని జగన్ మండిపడ్డారు. నాయకులకు అధికారులు తలవంచడం సరైన పద్ధతి కాదని జగన్ అన్నారు.
టీడీపీ నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తున్న పోలీసులను వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు. రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతలున్న లాక్కోస్తామని.. ఏ ఒక్కరిని వదలబోమని మీడియా ముఖంగా జగన్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ బెదిరింపులు జైలుకు వెళ్లడం కోసమే అన్న వాదన కూడా వినిప్తోంది. ఏదో ఒక విధంగా జైలుకు వెళ్లాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని.. జైలుకు వెళితే సింపథీ క్రియేటివ్ అవుతుంది. దాంతో ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతారని జగన్ భావిస్తున్నట్లు కొందరు నేతలు చెబుతున్నారు.