నిరు పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత పోతే ఎంత…స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు అన్న మాటలివి. పేదోళ్ల నోట్లోకి ఐదు వేళ్లు వెళ్లేలా చేయలేని ప్రభుత్వం ఎందుకని నిలదీసిన ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 250 అన్న క్యాంటీన్లు విజయవంతంగా నిర్వహించారు.
అయితే, టీడీపీపై పగ పెంచుకున్న జగన్…తాను అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లపై అక్కసు వెళ్లగక్కారు. అన్న క్యాంటీన్లను జగన్ సర్కార్ మూసివేసి పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసింది. అయితే, ఆ తర్వాత కొంతమంది టీడీపీ నేతలు అన్న క్యాంటీన్లను తెరవాలని చూసినా…వారికి ఎన్నో అవరోధాలు, అడ్డంకులు కల్పించింది జగన్ ప్రభుత్వం. అయినా సరే వాటన్నింటిని అధిగమించి తాజాగా మరోసారి రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అన్న క్యాంటీన్లను తెరిచారు టీడీపీ నేతలు.
స్థానిక టీడీపీ నేతలు, ప్రవాసాంధ్రుల చొరవతో చాలా ప్రాంతాల్లో పార్టీ తరపున అన్న క్యాంటీన్లు పున:ప్రారంభించారు. అధికార పార్టీ నాయకులు, అధికారుల సృష్టిస్తోన్న అడ్డంకుల్ని అధిగమిస్తూ పేదోడికి పట్టెడన్నం పెడుతూ వాళ్ల కళ్లల్లో ఆనందం..కడుపులో ఆకలి నింపుతున్నారు. అయితే, రాష్ట్రంలోని చాలా చోట్ల అన్న క్యాంటీన్లు తెరవాలనుకుంటున్న పలువురు టీడీపీ నేతలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో, జగన్ సర్కార్ పై పేదవారు మండిపడుతున్నారను.
భోజనం బయట వంద రూపాయలు అని, అన్ని డబ్బులు పెట్టి ఎలా తింటామని పేదలు జగన్ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు. అన్న క్యాంటీన్ వారు మొదలుబెట్టిన క్యాంటీన్లలో తాము అన్నం తింటున్నామని, మళ్లీ మరుసటి రోజు అన్న క్యాంటీన్ వాళ్లు వస్తేనే మాకు భోజనం అని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇట్లయినా బ్రతకనీ మమ్మల్ని అంటూ పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తనను భార్యాబిడ్డలు వదిలేశారని, రోడ్డు మీదకు వచ్చానని మరో నిరుపేద వాపోయాడు. కావాలని ఓట్లేసి గెలిపించుకున్నందుకు కూడు లేకుండా చేస్తావా? అని అతడు జగన్ ను నిలదీశాడు. మాకు నువ్వు ముద్ద పెట్టకపోయినా పర్వాలేదు..పెట్టేవాళ్లని పెట్టనీ…తిని బ్రతుకుతాం…వారిని కూడా అడ్డుకోవడం నీకు ధర్మమేనా..అని ప్రశ్నిస్తున్నారు.
నీ మూర్ఖత్వం తో ఇలాంటి వాళ్ళకి తిండి లేకుండా చేస్తున్నావ్.. @ysjagan pic.twitter.com/BTRpV97PT9
— iTDP UnOfficial (@iTDP_UnOfficial) August 2, 2022
Comments 1