కొందరు పోలీసులు ఖాకీ డ్రెస్సు పరువు తీస్తున్నారు. తమ పరిధులకు మించి నాయకులకోసం పనిచేస్తూ ప్రజల్లో చులకన అవుతున్నారు. ఏ వ్యవస్థలో అయినా అందరూ దొంగలే ఉండరు. నిజాయితీ పరులు కూడా ఉంటారు. కానీ కొందరి ప్రవర్తన వల్ల ప్రజలకు వ్యవస్థపైనే నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది.
తాజాగా జరిగిన రెండు ఘటనలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఒకటి మైదుకూరు వార్డు కార్పొరేటరును పోలీసులు ఎత్తుకెళ్లిన ఘటన. రెండోది… అమరావతి మండలం ధరణికోట గ్రామంలో జరిగిన ఘటన.
పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలం, ధరణికోట గ్రామంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు కోరం ఉన్నప్పటికీ…వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరపకుండా వెళ్లిపోతుండగా మెంబర్లు, గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎం.ఆర్.ఓ ను తెలుగుదేశం పార్టీ వార్డ్ మెంబర్లు నిలదీసినందుకు పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. వీడియో తీస్తున్న వ్యక్తిని కూడా వీడియో తీయొద్దంటూ పోలీసు బెదిరించడాన్ని స్పస్టంగా చూడొచ్చు.
బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రజల కోసం పనిచేయాలి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వాలు మారినపుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అదే ఎవరి పరిధిలో వారుంటే ప్రజలే అధికారులకు అండగా నిలబడతారు.
వైసీపీ నేతలు పోలీసులున్నది ప్రజల కోసం కాదు, మా పార్టీ రక్షణ కోసమే అన్నట్టు వ్యవహరిస్తుండటం విచారకరం.